7వ తరగతి విద్యార్ధినిని తల్లిని చేసిన 60 ఏళ్ల వృద్ధుడు: రోజూ ఇంటికి పిలిపించుకుని...

Siva Kodati |  
Published : Dec 08, 2019, 08:21 PM IST
7వ తరగతి విద్యార్ధినిని తల్లిని చేసిన 60 ఏళ్ల వృద్ధుడు: రోజూ ఇంటికి పిలిపించుకుని...

సారాంశం

మహిళలు, యువతులతో పాటు చిన్నారులపైనా దారుణాలు ఆగడం లేదు. తాజాగా ఒడిశాలో 7వ తరగతి విద్యార్ధినిపై 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. 

మహిళలు, యువతులతో పాటు చిన్నారులపైనా దారుణాలు ఆగడం లేదు. తాజాగా ఒడిశాలో 7వ తరగతి విద్యార్ధినిపై 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. కోరాపుట్ జిల్లాలో ఓ పాఠశాలకు నిందితుడి భార్య ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తూ స్టాఫ్ భవనంలో నివసిస్తున్నారు.

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: బుల్లెట్ గాయాలివే, పోస్టుమార్టం రిపోర్ట్ ఇదీ...

అయితే 7వ తరగతి చదువుతున్న విద్యార్ధినిని ఆ వృద్ధుడు ఇంటికి పిలిపించుకుని ఆ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఆమె ఇంట్లో తెలియడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: దేశం చూపు తెలంగాణ వైపు, ఆర్టీసీ కార్మికులకు వరాలు

రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా, 3 నెలల గర్భిణీగా తేలింది. దీంతో నిందితుడైన వృద్ధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆ చిన్నారిని ప్రస్తుతం బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం