76ఏళ్ల చరిత్రగల స్కూల్.. ఒకే ఒక్క స్టూడెంట్

By telugu teamFirst Published Jun 20, 2019, 11:48 AM IST
Highlights

ఎంత చిన్న స్కూల్ అయినా.. కనీసం 100మంది దాకా విద్యార్థులు ఉంటారు. అయితే...  ఓ స్కూల్లో మాత్రం ఒకే ఒక్క విద్యార్థి. అది కూడా మొన్న సోమవారమే జాయిన్ అయ్యాడు.

జూన్ నెల వచ్చిదంటే చాలు... పిల్లలు స్కూల్లకు పరుగులు తీసే సమయం ఆసన్నమైందని అర్థం. పాఠశాలలు కూడా కొత్త విద్యార్థులను స్కూల్లో చేర్పించుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎంత చిన్న స్కూల్ అయినా.. కనీసం 100మంది దాకా విద్యార్థులు ఉంటారు. అయితే...  ఓ స్కూల్లో మాత్రం ఒకే ఒక్క విద్యార్థి. అది కూడా మొన్న సోమవారమే జాయిన్ అయ్యాడు. అదేమీ కొత్త స్కూల్ కాదు. దానికి 76ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి స్కూల్ ని విద్యార్థులు ఎవరూ చేరడం లేదని మూసివేయగా... ఇదిగో ఈ బుడ్డోడి కోసం మళ్లీ రీ ఓపెన్ చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..కోయంబత్తూర్ కి చెందిన రాజేశ్వరి అనే మహిళ చిన్నకల్లార్ లోని టీ ఎస్టేట్ లో వర్కర్ గా పనిచేస్తోంది. ఆమెకు 6ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా... ఆ బాలుడిని తాజాగా స్కూల్లో చేర్పించాలని ఆమె భావించారు. వారి ఇంటికి సమీపంలో ఉన్న ఆది ద్రావిడ వెల్ ఫేర్ స్కూల్ ని పిల్లలు ఎవరూ చేరడం లేదని మూసివేశారు. అది తప్ప వారి ఇంటికి  సమీపంలో మరో స్కూల్ లేదు. దీంతో.. రాజేశ్వరి స్కూల్ ని తిరిగి రీ ఓపెన్ చేయాలని అధికారులను కోరింది.

ఆమె రిక్వెస్ట్ మేరకు స్కూల్ ని రీ ఓపెన్ చేశారు. ఆ స్కూల్లో ఆమె తన కుమారుడు శివను ఒకటో తరగతిలో చేర్పించారు. 1943లో ఈ పాఠశాలను ప్రారంభించగా.. కేవలం టీ వర్కర్ల పిల్లలు మాత్రమే ఇందులో విద్యను అభ్యసించేవారు. ప్రతి సంవత్సరం కనీసం 50మంది విద్యార్థులు ఉండేవారు. 70 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేసిన స్కూల్ ఆ తర్వాతర్వాత విద్యార్థులు తగ్గడం ప్రారంభించారు. దీంతో... పూర్తిగా మూసివేశారు. స్కూల్ ప్రిన్సిపల్ ని కూడా వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు. 

మళ్లీ ఆరేళ్ల శివ కోసం స్కూల్ తెరవాల్సి వచ్చింది. ఆ బాలుడి కోసం ప్రత్యేకంగా ఓ టీచర్ ని కూడా కేటాయించారు. 

click me!