India's cancer alert: చిన్నారుల‌పై క్యాన్స‌ర్ ముప్పు.. ప్రతియేట 75 వేల మంది పిల్ల‌లకు క్యాన్సర్ !

Published : Feb 16, 2022, 11:55 AM IST
India's cancer alert: చిన్నారుల‌పై క్యాన్స‌ర్ ముప్పు.. ప్రతియేట 75 వేల మంది పిల్ల‌లకు క్యాన్సర్ !

సారాంశం

India's cancer alert: రోజురోజుకూ క్యాన్స‌ర్ ముప్పు క‌ల‌క‌లం రేపుతున్న‌ది. ప్ర‌తి యేటా దేశంలో 75 వేల మంది చిన్నారులు వివిధ ర‌కాలైన క్యాన్స‌ర్ల బారిన‌ప‌డుతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వాటిలో ఎక్కువ‌గా సాధారణ క్యాన్స‌ర్ రకాలు లుకేమియా, మెదడు క్యాన్సర్‌లు, లింఫోమాలు, న్యూరోబ్లాస్టోమాస్, విల్మ్స్ ట్యూమర్‌ల వంటి ఘన కణితుల క్యాన్స‌ర్లు ఉంటున్నాయి. 

 India's cancer alert: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రతి సంవత్సరం దేశంలో దాదాపు 75,000 మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రపంచ చైల్డ్ వుడ్ క్యాన్సర్ భారం కనీసం 20 శాతం భారత్‌లోనే ఉంద‌ని తెలిపింది. క్యాన్సర్‌ సహా నాన్-కమ్యూనికేషన్ వ్యాధులు.. 5 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో దాదాపు 50 శాతం మరణాలకు కారణమవుతున్నాయి. ఈ సమస్య గురించి మెరుగైన అవగాహన కలిగి ఉండటం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) ఫిబ్రవరి 15న అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం (International Childhood Cancer Day) సందర్భంగా  వెల్ల‌డించింది. 

Childhood Cancer లలో అత్యంత సాధారణ రకాలు లుకేమియా, మెదడు క్యాన్సర్‌లు, లింఫోమాలు, న్యూరోబ్లాస్టోమాస్, విల్మ్స్ ట్యూమర్‌ల వంటి ఘన కణితులకు సంబంధించిన‌వి వున్నాయి. ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉన్న తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో Childhood క్యాన్స‌ర్ల‌ భారం ఎక్కువగా ఉంది. ముందస్తు రోగనిర్ధారణలో ముఖ్యమైన అడ్డంకులు, ఖచ్చితంగా నిర్ధారించలేకపోవడం, ఆరోగ్య సంరక్షణకు సరైన ప్రాప్యత కారణంగా 30 శాతం కంటే తక్కువ నయం చేయడానికి దోహదం చేస్తుంది. మెరుగైన సౌకర్యాలు, చికిత్సను వెంటనే ప్రారంభించలేకపోవడం కార‌ణంగా మ‌ర‌ణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. 

SLG హాస్పిటల్స్‌లోని కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ సోమ  మాట్లాడుతూ.. "గత కొన్ని దశాబ్దాలుగా క్యాన్సర్ కేర్ సేవలలో గణనీయమైన అభివృద్ధి ఉన్నప్పటికీ, Childhood క్యాన్సర్‌లను పూర్తిగా నయం చేసే విషయంలో భారతదేశం తక్కువ విజయవంతమైన రేటును కలిగి ఉంది. వైద్యుల దృష్టికి తీసుకువచ్చిన చాలా ప్రాణాంతక వ్యాధులు అధునాతన దశలో ఉన్నాయి. సరైన వైద్య సంరక్షణను పొందడంలో ఈ జాప్యానికి అవగాహన లేకపోవడం, చికిత్స తిరస్కరణ, ఆర్థిక పరిమితులు ప్రధాన కారణాలలో ఉన్నాయి" అని తెలిపారు. "మరొక ప్రధాన సమస్య ఏమిటంటే, Childhood క్యాన్సర్ సంరక్షణ సేవలు ప్రస్తుతం ప్రధాన నగరాల్లోని తృతీయ ఆరోగ్య కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలోని మెజారిటీ ఈ కొన్ని కేంద్రాలపై ఆధారపడవలసి వస్తుంది" అని తెలిపారు. 

KIMS హాస్పిటల్స్‌లోని కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ&హేమాటో ఆంకాలజిస్ట్&స్టెమ్ సెల్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ నరేందర్ కుమార్ తోట మాట్లాడుతూ.. “భారతదేశంలోని మొత్తం క్యాన్సర్‌లలో 1.6 నుండి 4.8 శాతం 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కనిపిస్తుంది. భారతదేశం అంతటా క్యాన్స‌ర్ ముప్పు, మరణాల రేటులో గణనీయమైన అంతర్-ప్రాంతీయ వైవిధ్యం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసుల నిర్ధారణ, మరణాల నోటిఫికేషన్‌లో సాధ్యమయ్యే లోపాన్ని సూచిస్తుంది. పెద్దల ప్రాణాంతకతలా కాకుండా, Childhood  క్యాన్సర్‌లకు చాలా సందర్భాలలో తెలిసిన కారణం ఉండదు. జన్యుపరమైన కారణాల వల్ల 10 శాతం కేసులు మాత్రమే ఉన్నాయి. స్క్రీనింగ్ ద్వారా బాల్య క్యాన్సర్‌లను నివారించలేము.. గుర్తించలేము" అని తెలిపారు. 

Childhood  క్యాన్సర్‌ల లక్షణాలు సాధారణంగా వివరించలేని బరువు తగ్గడం, ఎముకలు, కీళ్లు లేదా కాళ్లలో నిరంతర నొప్పి, పొత్తికడుపు, ఛాతీ, మెడ లేదా పొత్తికడుపులో గడ్డలు/మాస్, విపరీతమైన గాయాలు లేదా రక్తస్రావం, సుదీర్ఘమైన అలసట, తెల్లగా కనిపించడం మొదలైనవి సాధార‌ణ ల‌క్ష‌ణాలుగా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. Childhood  క్యాన్సర్ సంరక్షణను పరిష్కరించడానికి భారతదేశం ప్రత్యేకంగా ఒక పాలసీ ఫ్రేమ్‌వర్క్ అవ‌స‌ర‌మ‌ని వైద్యులు పేర్కొంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !