దేశం కోసం వీరోచిత పోరాటం.. భారత సైనికులకు శౌర్య పురస్కారాలు

By telugu teamFirst Published Aug 15, 2019, 11:29 AM IST
Highlights

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఉన్నారని వచ్చిన సమాచారం మేరకు ప్రకాష్ జాదవ్ తన టీంతో కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, ఆర్మీకి మధ్య ఎదురు కాల్పలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఓ ఉగ్రవాదిని ప్రకాష్ ధైర్యంగా ఎదురుకొని మట్టుపెట్టారు. మరో ఉగ్రవాది చేసిన పెట్రోల్ దాడిలో ఆయనకు తీవ్రంగా గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయారు. 

దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడిన భారత ఆర్మీ అధికారులకు అత్యుత్తమ పురస్కారాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జమ్మూ కశ్మీర్ ఆపరేషన్ లో అద్భుతమైన పాత్ర పోషించిన ఇండియన్ ఆర్మీ సప్పర్ ప్రకాష్ జాదవ్ కి కీర్తి చక్ర పురస్కారాన్ని అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనతోపాటు మరో 8మందికి శౌర్య పురస్కారాలు అందజేయనున్నారు. వారిలో ఐదుగురు మరణానంతరం ఈ అవార్డులను గెలుచుకున్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పురస్కారాలు అందజేస్తున్నారు.

1.కీర్తి చక్ర

ఈ పురస్కారాన్ని సప్పర్ ప్రకాష్ జాదవ్ కి అందజేస్తున్నారు. మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం దక్కుతోంది. 2018 నవంబర్ 27వ తేదీన ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఉన్నారని వచ్చిన సమాచారం మేరకు ప్రకాష్ జాదవ్ తన టీంతో కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, ఆర్మీకి మధ్య ఎదురు కాల్పలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఓ ఉగ్రవాదిని ప్రకాష్ ధైర్యంగా ఎదురుకొని మట్టుపెట్టారు. మరో ఉగ్రవాది చేసిన పెట్రోల్ దాడిలో ఆయనకు తీవ్రంగా గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయారు. 

2. శౌర్య చక్ర

ఈ పురస్కారాన్ని లెఫ్టినెంట్ కల్నల్ అజయ్ సింగ్ కుశ్వహ్ కి అందజేస్తున్నారు. నవంబర్ 22, 2018లో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో అజయ్ సింగ్ చూపించిన ధైర్య సాహాలకు మెచ్చి ఆయనకు ఈ పుస్కారం అందజేస్తున్నారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమచారం మేరకు రంగంలోకి దిగిన అజయ్ సింగ్ బృందం ఎంతో చాకచక్యంగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అజయ్ సింగ్ తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఉగ్రవాదులను పట్టుకోగలిగారు. అందుకే ఆయనకు శౌర్య పురస్కారం అందజేస్తున్నారు.

3.శౌర్య చక్ర

కెప్టెన్ విభూతి శంకర్ దౌండియాల్ కి మరణానంతరం శౌర్య చక్ర పురస్కారం దక్కుతోంది. భారత ఆర్మీలో ఆయన ఎంతో ధైర్య సాహాలు, లీడర్ షిప్ క్వాలిటీస్  కనపరిచారు. 17 ఫిబ్రవరి 2019లో జమ్మూకశ్మీర్ లోని ఓ గ్రామంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారనే సమాచారం మేరకు ఆయన తన బృందంతో కలిసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ సమయంలో ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోవడంతోపాటు వారి వద్ద ఉన్న 200కేజీల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. ఈ క్రమంలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రగాయాలపాలై విభూతి శంకర్ ప్రాణాలు విడిచారు. ఆయన త్యాగానికి మెచ్చి శౌర్య పురస్కారం అందజేస్తున్నారు.

4.శౌర్య చక్ర

కెప్టెన్ మహేష్ కుమార్ భురే కి నేడు శౌర్య చక్ర పురస్కారం అందజేస్తున్నారు. 25నవంబర్ 2018లో కెప్టెన్ మహేష్ కుమార్ తన బృందంతో ఉగ్రవాదులను ధీటుగా ఎదురుకున్నారు.  ఆరుగురు కీలక ఉగ్రవాదులను పట్టుకోవడంలో ఆయన చాలా ధైర్య సాహసాలు కనపరిచారు. ఆయన ధైర్యానికి మెచ్చి శౌర్య చక్ర అందజేస్తున్నారు.

5.శౌర్య చక్ర
సందీప్ సింగ్ కి మరణానంతరం ఈ శౌర్య చక్ర పురస్కారం దక్కుతోంది. 2018 సెప్టెంబర్ 22న ఆయన ఉగ్రవాదులతో పోరాడి తుది శ్వాస విడిచారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు ప్రవేశించి పెద్ద మారణ హోమం సృష్టించేందుకు పథకం చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఆయన దాడులు నిర్వహించారు. ఓ ఫారెన్ ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో ఆయన అమరులయ్యారు. ఆయన త్యాగానికి మెచ్చి ఈ పురస్కారం అందజేస్తున్నారు.

6.శౌర్య చక్ర.. బ్రజేష్ కుమార్

సిపాయి బ్రజేష్ కుమార్ కి మరణానంతరం శౌర్య చక్ర పురస్కారం దక్కుతోంది. 2018 అక్టోబర్ 26న ఆయన ఉగ్రవాదులతో పోరాడుతూ  విధులు నిర్వహిస్తూనే ప్రాణాలు విడిచారు. విధి నిర్వహణలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం అందిస్తున్నారు.

7. శౌర్య చక్ర.. సిపాయి హరి సింగ్.

సిపాయి హరి సింగ్ కి కూడా మరణానంతరం శౌర్య చక్ర పురస్కారం దక్కుతోంది. 2019 ఫిబ్రవరి 18వ తేదీన ఉగ్రవాదులకు, భారత సైనికులకు మధ్య జరిగిన బీకర పోరులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆయన చూపించిన ధైర్య సాహసాలకు గుర్తుగా ఈ పురస్కారం అందజేస్తున్నారు.

8.రైఫిల్ మ్యాన్ అజ్వీర్ సింగ్ చౌహాన్.. కి శౌర్య చక్ర పురస్కారం అందజేస్తున్నారు. జమ్మూకశ్మీర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఆయన విధులు నిర్వహిస్తూ ఉంటారు.  కశ్మీర్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను విజయవంతంగా పట్టుకోవడంలో అజ్వీర్ సింగ్ ఎంతో ధైర్య సాహాలను ప్రదర్శించారు. అందుకే ఆయనకు శౌర్య చక్ర పురస్కారం అందజేస్తున్నారు.

9. రైఫిల్ మ్యాన్ శివకుమార్ కి మరణానంతరం శౌర్య చక్ర పురస్కారం దక్కుతోంది. 2018, ఆగస్టు 31 వ తేదీన ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో ఆయన తన ప్రాణాలను కోల్పోయారు. ఆయన త్యాగానికి ప్రతీకగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. 

click me!