అక్కడ 71 వ్యాక్సినేషన్ సెంటర్లు మూసేశారు.. ఎందుకంటే..

By AN TeluguFirst Published Apr 9, 2021, 5:44 PM IST
Highlights

కోవిడ్ టీకాలు నిండిపోవడంతో ముంబైలో 71 వ్యాక్సినేషన్ సెంటర్లను మూసివేశారు. నగరంలోని అత్యంత ముఖ్యమైన కమర్షియల్ జోన్ బికేసీలో ఉన్న జంబో వ్యాక్సినేషన్ సెంటర్ కూడా ఇందులో ఉండడం గమనార్హం. ఈ కేంద్రాన్ని మూసివేయడంతో సెంటర్ బయట లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.

కోవిడ్ టీకాలు నిండిపోవడంతో ముంబైలో 71 వ్యాక్సినేషన్ సెంటర్లను మూసివేశారు. నగరంలోని అత్యంత ముఖ్యమైన కమర్షియల్ జోన్ బికేసీలో ఉన్న జంబో వ్యాక్సినేషన్ సెంటర్ కూడా ఇందులో ఉండడం గమనార్హం. ఈ కేంద్రాన్ని మూసివేయడంతో సెంటర్ బయట లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.

ఇక్కడ టీకాలు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి నిన్నటి వరకు సరిపడా వ్యాక్సిన్ ల స్టాక్ ఉందని, నేటి స్టాక్ గత రాత్రే వస్తుందని భావించినా రాలేదని సెంటర్ డీన్  రాజేశ్ డేరే తెలిపారు. 

నగరంలో 120 సెంటర్ల ద్వారా వ్యాక్సిన్ వేస్తున్నారు. వీటిలో 71 సెంటర్లలో వ్యాక్సిన్ డోసులు నిండిపోవడంతో మూసివేసినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. 49 కేంద్రాలలో ఒక్కో దాంట్లో 40 - 50 వేల మందికి టీకాలు వేస్తున్నారు.

నగరంలోని చాలా వరకు కేంద్రాలు వ్యాక్సిన్ లేక మూతపడ్డాయని ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ తెలిపారు.  నిజానికి నేడు 76 వేల నుంచి లక్ష కొవిడ్ టీకా డోసులు రావాల్సి ఉందని.. కానీ వీటిపై అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. టీకాలు లేని కారణంగా ముంబై సతారా సాంగ్లీ లోని కేంద్రాలను మూసి వేయాల్సి వచ్చింది అన్నారు.

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే నిన్న మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రకు తక్కువ టీకాలు వస్తున్నట్లు ఆరోపించారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదు మహారాష్ట్రలో వారానికి 40 లక్షల టీకా డోసులు కావాలని, నెలకు 1.6 కోట్ల టీకాలు అవసరమని అన్నారు.

మహారాష్ట్ర కంటే తక్కువ జనాభా కలిగిన గుజరాత్ కు కోటి టీకాలు ఇచ్చారని, మహారాష్ట్రకు కూడా  అన్నే ఇచ్చారని అన్నారు. ఈ విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని, రాష్ట్రానికి కేటాయించిన టీకాల సంఖ్యను ఏడు లక్షల నుంచి 15 లక్షలకు పెంచాలని ఆయన కోరారు.
 

click me!