భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నం: ఏడుగురు పాక్ సైనికులు హతం

By Siva KodatiFirst Published Aug 4, 2019, 11:41 AM IST
Highlights

ఎల్ఓసీ వెంబడి భారత సైనిక పోస్టులపై దాడికి దిగి, చొరబడేందుకు ప్రయత్నించిన పాక్ సైన్యం ప్రయత్నాలను భారత బలగాలు తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా భారత కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీంకు చెందిన ఏడుగురు మృతి చెందారు

జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర రద్దు, సైన్యం మోహరింపు వంటి పరిణామాల నేపథ్యంలో కశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు, పాక్ సైన్యం నియంత్రణా రేఖ వెంబడి చొరబాట్లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దుల వెంబడి భద్రతా దళాలు డేగ కళ్లతో నిఘా పెట్టాయి.

ఈ క్రమంలో ఎల్ఓసీ వెంబడి భారత సైనిక పోస్టులపై దాడికి దిగి, చొరబడేందుకు ప్రయత్నించిన పాక్ సైన్యం ప్రయత్నాలను భారత బలగాలు తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా భారత కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీంకు చెందిన ఏడుగురు మృతి చెందారు.

జూలై 31వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణాన్ని, అమర్‌నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు పాక్ బలగాలు గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేశాయని.. ఇందుకు భారత్ ధీటుగా బదిలిచ్చిందని సైనిక ప్రతినిధి తెలిపారు. 
 

భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నం: ఏడుగురు పాక్ సైనికులు హతం

తెల్లజెండాలతో వచ్చి సైనికుల మృతదేహాలు తీసుకెళ్లండి: పాక్‌కు భారత్ ఆఫర్

కశ్మీర్‌ లోయను జల్లెడపడుతున్న సైన్యం: నలుగురు జైషే ఉగ్రవాదులు హతం

click me!