తమిళనాడు కడలూరులో విషాదం.. చెక్‌ డ్యామ్‌లో స్నానానికి వెళ్లి ఏడుగురు మృతి

Published : Jun 05, 2022, 02:56 PM ISTUpdated : Jun 05, 2022, 03:13 PM IST
తమిళనాడు కడలూరులో విషాదం.. చెక్‌ డ్యామ్‌లో స్నానానికి వెళ్లి ఏడుగురు మృతి

సారాంశం

తమిళనాడులోని  కడలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెక్ డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఏడుగురు నీటిలో ముగిగి చనిపోయారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

తమిళనాడులోని  కడలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెక్ డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఏడుగురు నీటిలో ముగిగి చనిపోయారు. వివరాలు.. కడలూరు సమీపంలోని ఎ. కూచిపాళయం ప్రాంతంలోని కెడిలం నది ఆనకట్ట సమీపంలో స్నానానికి నీటిలోకి దిగిన ఏడుగురు నీటిలో మునిగి మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కడలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో మృతిచెందినవారిలో నలుగురు బాలికలు ఉన్నట్టుగా సమాచారం. వీరు నదిలో ఈతకు వెళ్లిన సమయంలో.. డ్యామ్ సమీపంలో సుడిగుండం కారణంగా ఇద్దరు నీటిలో మునిగిపోయారు. వారిని రక్షించేందుకు వెళ్లిన మిగిలిన ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. కాగా, మృతుల వివరాలతో పాటు.. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !