ఘోర ప్రమాదం, పెళ్లికి వెళ్లి వస్తున్న బస్సుని ఢీకొన్న మరో బస్సు, 7గురు మృతి

Published : Jul 19, 2021, 01:16 PM IST
ఘోర ప్రమాదం, పెళ్లికి వెళ్లి వస్తున్న బస్సుని ఢీకొన్న మరో బస్సు, 7గురు మృతి

సారాంశం

పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో.. బస్సుని రోడ్డు పక్కన నిలిపివేయగా.. మరో బస్సు వేగంగా వచ్చి దీనిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరప్రదేశ్ లో ఘెర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లాహర్వాన్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

ఆగ్రా-చందౌసీ హైవే పై బహజోయి పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో.. బస్సుని రోడ్డు పక్కన నిలిపివేయగా.. మరో బస్సు వేగంగా వచ్చి దీనిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 

తీవ్రగాయాలపాలైన మరో ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మృతులు విర్పాల్(60), హప్పు(35), చోటే(40), రాకేష్(30), అభయ్(18), వినీత్(30), భురే(25) గా గుర్తించారు. వీరంతా పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా.. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ మంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటనపై ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..