మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మృతి, 14 మందికి తీవ్ర గాయాలు..

Published : Oct 01, 2021, 10:52 AM IST
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మృతి, 14 మందికి తీవ్ర గాయాలు..

సారాంశం

గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని 79 కి.మీ దూరంలోని గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు,  కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు ప్రయాణికులు మరణించారు. 14 మంది గాయపడ్డారు. భింద్ జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలో ఉన్న హైవేపై ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని 79 కి.మీ దూరంలోని గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సులోని వ్యక్తులు గ్వాలియర్ నుండి మధ్యప్రదేశ్‌లోని బరేలీ పట్టణానికి ప్రయాణం చేస్తున్నారు.

దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. "ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అరెస్ట్ చేసాం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం" అని పోలీసు అధికారి మనోజ్ సింగ్ తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌