నేటీ నుంచి క‌ర్ణాట‌క‌లో ద్రౌపది ముర్ము పర్యట‌న‌.. తొలిసారి రాష్ట్ర‌ప‌తి హోదాలో ..

By Rajesh KarampooriFirst Published Sep 26, 2022, 3:16 AM IST
Highlights

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటీ నుంచి మూడు రోజుల పాటు కర్ణాటకలో పర్యటించనున్నారు. ఆమె రాష్ట్రపతి హోదాలో తొలి సారి క‌ర్ణాట‌కలో ప‌ర్య‌టించ‌నున్నది. సోమవారం మైసూరులోని చాముండి హిల్స్‌లో దసరా ఉత్సవాలను ఆమె ప్రారంభించనున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబరు 26 నుంచి 28 వరకు కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ ప‌లు కీల‌క  కార్యక్రమాల్లో పాల్గొన‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్రపతి భవన్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారత రాష్ట్రపతి హోదాలో ఆమె ఏ రాష్ట్రానికైనా వెళ్లడం ఇదే తొలిసారి అని పేర్కొంది. సోమవారం మైసూరులోని చాముండి హిల్స్‌లో దసరా ఉత్సవాలను ఆమె ప్రారంభించనున్నారు.

అదే రోజు హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హుబ్బళ్లిలో నిర్వహించే ‘పౌర సన్మాన’ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరవుతారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే.. ధార్వాడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొత్త క్యాంపస్‌ను కూడా ఆమె ప్రారంభించనున్నారు.

మ‌రుసాటి రోజు(మంగళవారం) బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్‌ల తయారీ యూనిట్ ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అనంత‌రం ఆమె జోనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (సౌత్ జోన్)కి శంకుస్థాపన చేయ‌నున్నారు. అదే రోజు సెయింట్ జోసెఫ్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్న‌నున్నారు. బెంగళూరులో ఆమె గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం రిసెప్షన్‌ను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 28న రాష్ట్రపతి ముర్ము న్యూఢిల్లీకి తిరిగి రానున్నారు.
 

click me!