యువతిపై ఏడాదిగా వృద్ధపుజారి అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన యువతి

sivanagaprasad kodati |  
Published : Oct 10, 2018, 11:07 AM IST
యువతిపై ఏడాదిగా వృద్ధపుజారి అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన యువతి

సారాంశం

జమ్మూకశ్మీర్‌లో దారుణం జరిగింది. యువతిపై ఓ ఆలయ పుజారి ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడి ఆమెను తల్లిని చేశాడు. వివరాల్లోకి వెళితే రేయాసి జిల్లాకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి తన గ్రామంలోని గుడికి తరచుగా వెళ్లేది.. ఈ క్రమంలో గుడిలో పనిచేసే మథురకు చెందిన 65 ఏళ్ల ఆలయ పుజారితో పరిచయం ఏర్పడింది

జమ్మూకశ్మీర్‌లో దారుణం జరిగింది. యువతిపై ఓ ఆలయ పుజారి ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడి ఆమెను తల్లిని చేశాడు. వివరాల్లోకి వెళితే రేయాసి జిల్లాకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి తన గ్రామంలోని గుడికి తరచుగా వెళ్లేది..

ఈ క్రమంలో గుడిలో పనిచేసే మథురకు చెందిన 65 ఏళ్ల ఆలయ పుజారితో పరిచయం ఏర్పడింది. యువతిపై కన్నేసిన ఆ వృద్ధుడు మాయమాటలు చెప్పి లోబరుచుకుని ఏడాది నుంచి అత్యాచారం చేస్తున్నాడు.

ఈ క్రమంలో అక్టోబర్ 6న ఆ యువతి తీవ్రమైన కడుపునొప్పితో స్థానిక ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులకు గర్భం దాల్చినట్లు అనుమానం రావడంతో జమ్మూలోని ప్రసూతి ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు.

జమ్మూకు వెళ్లిన యువతికి అక్కడి వైద్యులు సీజేరియన్ చేసి డెలీవరి చేశారు. ఈ క్రమంలో బాలిక మృతశిశువుకి జన్మనిచ్చింది. జరిగిన దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. మరోవైపు సదరు వృద్ధ పుజారి తనను తాను దేవుడిగా ప్రకటించుకుని స్వామిజీగా మారాడు. తన బండారం బట్టబయలు కావడంతో పారిపోయాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే