ఇంటివరండాలో నిద్రిస్తున్న 65యేళ్ల మహిళ హత్య.. యూపీలో దారుణం..

Published : Feb 22, 2023, 10:43 AM IST
ఇంటివరండాలో నిద్రిస్తున్న 65యేళ్ల మహిళ హత్య.. యూపీలో దారుణం..

సారాంశం

శకుంతలా సింగ్ అనే 65యేళ్ల మహిళ మంగళవారం మాఘి గ్రామంలోని తన ఇంటిలో  ​​శవమై కనిపించింది. సింగ్‌ను పదునైన ఆయుధంతో హత్య చేశారని, ఆమె తన సోదరితో కలిసి జీవిస్తోందని పోలీసులు తెలిపారు.

ఉత్తర ప్రదేశ్ : ఓ 65యేళ్ల మహిళను హత్య చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. పదునైన ఆయుధంతో ఆమెను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. 65 ఏళ్ల మహిళ మృతదేహం జిల్లాలోని ఒక గ్రామంలో లభ్యమైనట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

శకుంతలా సింగ్ అనే మహిళ మంగళవారం మాఘి గ్రామంలోని తన ఇంటిలో చాపరాయిపై శవమై కనిపించిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (పశ్చిమ) రోహిత్ మిశ్రా తెలిపారు. సింగ్‌ను పదునైన ఆయుధంతో హత్య చేశారని, ఆమె తన సోదరితో కలిసి జీవిస్తోందని పోలీసులు తెలిపారు.

సోమవారం రాత్రి ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆ మహిళ వెళ్లిందని మిశ్రా తెలిపారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత వరండాలో నిద్రించింది. మంగళవారం తెల్లవారేసరికి ఆమె మృతదేహంగా మారింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వింత నిబంధన : పెళ్లి కాని అమ్మాయిలు ఫోన్లు వాడొద్దు.. గుజరాత్ లో ఠాకూర్ సమాజ్ సభ్యుల నిర్ణయం..

ఇదిలా ఉండగా, అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు తన కుక్కతో కలిసి వెళ్తున్న సమయంలో ఓ మొసలి దాడి చేయడంతో చనిపోయింది. దాడి జరిగినప్పుడు మహిళ తన కుక్కను రిటైర్‌మెంట్ కమ్యూనిటీ దగ్గరున్న చెరువు దగ్గరకు తీసుకు వెళ్తోంది.
సీఎన్ఎన్ మీడియా కథనం ప్రకారం, ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమీషన్ (ఎఫ్ డబ్ల్యూసీ), సెయింట్ లూసీ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ అధికారులు ఫ్లోరిడాలోని సెయింట్ లూసీలో మొసలి దాడి గురించి 911కు కాల్‌ వచ్చింది.

ఎఫ్ డబ్ల్యూసీ ప్రతినిధి మాట్లాడుతూ, సంఘటన జరిగినప్పుడు మహిళ తన కుక్కతో ఉందని, అయితే ఈ ఘటనలో కుక్క ప్రాణాలతో బయటపడిందని, కానీ అది ఎక్కడుందో, ప్రస్తుతం దాని పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో తెలియదన్నారు. మీడియా నివేదికల ప్రకారం, మహిళ కుక్కతో పాటు వాకింగ్ చేస్తున్నప్పుడు, చెరువులో నుంచి ఒక మొసలి బయటకు వచ్చి కుక్కను పట్టుకుంది. దీంతో, కుక్కను కాపాడేందుకు మహిళ ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. సెయింట్ లూసీ కౌంటీ షెరీఫ్ కెన్ మస్కరా మాట్లాడుతూ మొసలి దాదాపు 11 అడుగుల పొడవు ఉంటుందని అంచనా వేశారు.

ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి పాల్పడిన మొసలిని ఎలిగేటర్ ట్రాపర్ తో పట్టుకున్నారు. ‘బాధిత కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి" అని ఎఫ్ డబ్ల్యూసీ ప్రకటనలో పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం