
చెన్నై : తమిళనాడులోని నామక్కల్ జిల్లా పల్లెపాళయంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ 70యేళ్ల వృద్ధురాలిపై 65యేళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. కాడసనల్లూర్ ఆది ద్రావిడర్ కాలనీకి చెందిన కుంజయమ్మాల్ (70) ఒంటరిగా ఉంటోంది.
ఆదివారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన ఉదయసూర్యన్ అనే 65యేళ్ల వృద్ధుడు కుంజయమ్మాళ్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఈ విషయం బైటికి చెబుతే.. చంపేస్తానని బెదిరించాడు. ఆ తరువాత అక్కడినుంచి పరారయ్యాడు.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్నారు. సోమవారం పోలీసులు ఉదయసూర్యన్ ను అరెస్ట్ చేశారు. అత్యాచారానికి గురైన కుంజయమ్మాళ్ ను చికిత్స కోసం తిరుచెంగోడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.