ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

Published : Aug 29, 2023, 02:30 AM IST
ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

సారాంశం

Bengaluru: కర్ణాటకలో ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్ యూవీ-బస్సు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. మృతులు బెంగళూరులోని చందాపురకు చెందిన యాత్రికులు కాగా, చామరాజనగర్ లోని మలే మహదేశ్వర ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

Karnataka road accident: కర్ణాటకలో ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్ యూవీ-బస్సు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. మృతులు బెంగళూరులోని చందాపురకు చెందిన యాత్రికులు కాగా, చామరాజనగర్ లోని మలే మహదేశ్వర ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఎస్ యూవీ వాహనం, ప్రభుత్వ బస్సు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. జిల్లాలోని సాతనూర్ పట్టణానికి సమీపంలోని కెమ్మలే గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు బెంగళూరులోని చందాపురకు చెందిన యాత్రికులు కాగా, చామరాజనగర్ లోని మలే మహదేశ్వర ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతుల్లో నగేష్, పుట్టరాజు, జ్యోతిలింగప్ప (కారు యజమాని), గోవింద, కుమార్ ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో కారు నుజ్జునుజ్జ‌యింది. బస్సు డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా దెబ్బతిన్న  ఎస్ యూవీ వాహనం నుంచి పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?