పెళ్లి ట్రాక్టర్ బోల్తా..వరుడు సహా ఆరుగురి మృతి

Published : Dec 04, 2020, 09:00 AM ISTUpdated : Dec 04, 2020, 09:02 AM IST
పెళ్లి ట్రాక్టర్ బోల్తా..వరుడు సహా ఆరుగురి మృతి

సారాంశం

ఈ ప్రమాదంలో పెళ్లి బృందంలోని వరునితో పాటు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హర్సూద్, ఖాల్వాలలోని ఆసుపత్రులకు తరలించారు. 

ఆనందంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ట్రాక్టర్ లో పెళ్లి మండపానికి బయలు దేరారు. కానీ.. మార్గ మధ్యలో వారిని మృత్యువు కబళించింది. వరుడు సహా.. దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లోని ఖండ్వాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖండ్వా-బైతూల్ హైవేపై మెహ్లూ గ్రామం సమీపంలో ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి బృందంలోని వరునితో పాటు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హర్సూద్, ఖాల్వాలలోని ఆసుపత్రులకు తరలించారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన ట్రాక్టర్ ట్రాలీలో 35మంది పెళ్లివారు ఉన్నారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా కొట్టగానే దానిలోని వారంతా ట్రాలీ కింద చిక్కుకుపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు సంఘటనా స్థలానికి ఐదు అంబులెన్స్‌లు చేరుకున్నాయి. ఈ దుర్ఘటన గురించి తెలియగానే ఖండ్వా కలెక్టర్ ద్వివేది, ఎస్పీ వివేక్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెయిలింగ్‌ను ఢీకొని ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !