హిమాచల్ ప్రదేశ్‌లో పోటెత్తిన వరదలు.. ఆరుగురు దుర్మరణం.. మరో 13 మంది మిస్సింగ్!

By Mahesh KFirst Published Aug 20, 2022, 1:25 PM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్‌తో వరదలు పోటెత్తాయి. క్లౌడ్ బరస్ల్, వరదలు, కొండ చరియలు విరిగిపడటం  మూలంగా ఆరుగురు మరణించారు. కాగా, మరో 13 మంది కనిపించకుండా పోయారు.
 

హిమాచల్ ప్రదేశ్‌లో పోటెత్తిన వరదలు.. ఆరుగురు దుర్మరణం.. మరో 13 మంది మిస్సింగ్!

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం కుండపోతగా కురిసింది. రాత్రికి రాత్రే ఇల్లు చెరువైంది. కొండ చరియలు విరిగిపడ్డాయి. రోడ్లన్నీ నదులయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్, కొండ చరియలు విరిగిపడటం మూలంగా ఆరుగురు మరణించారు. మరో 13 మంది గల్లంతయ్యారు.

హమీర్‌పూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చాయి. భారీ వర్షం స్వల్ప వైశాల్యంలోనే కురవడంతో వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో 22 మంది చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా కాపాడినట్టు అధికారులు తెలిపారు. 

చంబా జిల్లాలో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురవడంతో కొండచరియలు విరిగి ఇండ్లు కూలిపోయాయి. ఇలా ఓ ఇల్లు కూలిపోవడంతో నిద్రిస్తున్న ముగ్గురు మరణించారు. చొవారీ తెహసీల్ బానెట్ గ్రామంలో ఉదయం 4.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, మండీలో ఒక బాలిక మృతి చెందింది. మరో 13 మంది కనిపించకుండా పోయారు. బాలిక డెడ్ బాడీని ఆమె ఇంటి నుంచి అర కిలోమీటరు దూరంలో కనిపించారు. కాగా, శుక్రవారం రాత్రి ఆమె కుటుంబానికి చెందిన ఐదుగురు వరదలో కొట్టుకుపోయారని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. కాగా, కాషన్ గ్రాామంలో కొండ చరియలు విరిగిపడటంతో ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఇల్లు శిథిలాల కిందే ఎనిమిది మంది మృతదేహాలు చికక్కుకకుని ఉన్నాయి. ఇంకా డెడ్ బాడీని వెలికి తీయలేదు. మండీ జిల్లాలోని పలు రోడ్లు ఈ ఆకస్మిక వరదల కారణంగా మూసేశారు.

కాంగ్రాలో ఓ ఇల్లు కూలిపోవడంతో తొమ్మొది సంవత్సరాల బాలిక మరణించింది. అదే జిల్లాలో మరో ప్రమాదంలో 48 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి కూడా మరణించారు. కాంగ్రాలో నది పై రైల్ బ్రిడ్జీకి చెందిన రెండు పిల్లలర్లు కూడా కూలిపోయాయి.

ఈ వర్షాలు 25వ తేదీ వరకు కొనసాగే అవకాశమే ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, రానున్న 24 గంటల్లో కాంగ్రా, చంబా, మండీ, కుల్లు, షిమ్లా, సోలాన్, హమీపూర్, ఉనా, బిలాస్‌పూర్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నయని రాష్ట్ర విపత్తు నిర్వాహణ శాఖ తెలిపింది. 

సీఎం జైరాం ఠాకూర్ మృతులకు సంతాపం తెలిపారు. మృతుల కుటంబాలకు సంతపాం తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లో రెస్క్యూ ఆపరేషన్ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నదని వివరించారు.
 

click me!