ఆ పిల్లాడి మృతిలో ‘దళిత’ కోణం లేదు, స్కూల్లో కుండనే లేదు.. రాజస్థాన్ చైల్డ్ ప్యానెల్ షాకింగ్ రిపోర్ట్...

Published : Aug 20, 2022, 12:52 PM IST
ఆ పిల్లాడి మృతిలో ‘దళిత’ కోణం లేదు, స్కూల్లో కుండనే లేదు.. రాజస్థాన్ చైల్డ్ ప్యానెల్ షాకింగ్ రిపోర్ట్...

సారాంశం

దేశవ్యాప్తంగా సంచనలం కలిగించిన రాజస్థాన్ దళిత బాలుడి మృతి కేసులో చైల్డ్ ప్యానల్ షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. బాలుడి మృతి కేసులో కులం కోణమే లేదని తేల్చింది. 

జైపూర్ : నీళ్ల కుండను తాకాడని ఓ దళిత చిన్నారిని టీచర్ కొట్టడంతో ఆ దెబ్బలకు ఆ చిన్నారి మరణించడం…ఇటీవలి కాలంలో వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ కూడా నడిచింది. అయితే.. ఈ ఘటన మీద ఇప్పుడొక షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై శుక్రవారం రాజస్థాన్ చైల్డ్ ప్యానెల్ షాకింగ్ రిపోర్టును సమర్పించింది. అసలు ఈ వ్యవహారంలో ‘దళిత్’ అనే కోణమే ప్రస్తావన లేదని తేల్చేసింది. జలోర్ లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని.. భోజన సమయంలో మంచినీళ్ల కుండ తాకాడు అంటూ.. అగ్రకులానికి చెందిన ఒక టీచర్ తీవ్రంగా కొట్టాడని.. ఆ దెబ్బలకి  తట్టుకోలేక  ఆ చిన్నారి మరణించాడని…దళితుడు కావడం వల్లనే అతడిపై అలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వార్తలు, కథనాలు  వచ్చాయి.

అయితే, డ్రాయింగ్ బుక్ విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని..  ఆ గొడవ తనదాకా రావడంతో ఆ ఇద్దరు విద్యార్థులను టీచర్ విపరీతంగా కొట్టాడని తేలింది. అందులో ఒక చిన్నారి మృతి చెందిన బాధితుడు. కంటికి, చెవికి తీవ్ర గాయాలు కావడంతో ఆ 9 ఏళ్ల చిన్నారికి చికిత్స అందించారు. ఆ సమయంలోనే చిన్నారి మృతి చెందాడు. ఇది.. రాజస్థాన్ బాలల హక్కుల సంఘం, రాజస్థాన్ ప్రభుత్వానికి…విద్యా శాఖకు ఇచ్చిన నివేదికలోని సారాంశం. ఈ మేరకు స్కూల్ను సందర్శించిన చైల్డ్ ప్యానెల్ సభ్యులు.. బాధిత చిన్నారి తోటి విద్యార్థులను, టీచర్లను ఆరా తీసినట్లు తెలుస్తోంది.అంతే కాదు  బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జిల్లా పరిపాలన అధికారి అందించిన వివరాల ప్రకారం ఆ స్కూలులో కుండనే లేదని… తాగునీటి కోసం ఓ ట్యాంకర్ను ఉపయోగిస్తున్నట్లుగా గుర్తించారు.

నీళ్ళ కుండ ముట్టుకున్నాడని.. తొమ్మిదేళ్ల దళిత బాలుడిని కొట్టి చంపిన టీచర్..

బాధితుడి సోదరులు ఏమంటున్నారంటే…
అయితే, బాధితుడి సోదరులు ఇద్దరు నరేష్ కుమార్, నాపారాంలు అదే స్కూల్లో చదువుతున్నారు. వాళ్లు మాత్రం తమ తమ్ముడు  మధ్యాహ్న భోజన సమయంలో మంచి నీటి కుండ నుంచి నీళ్లు తీసుకున్నాడని.. అందుకే టీచర్ చితకబాదాడు అని చెబుతున్నారు. వీళ్ళ స్టేట్మెంట్ను కూడా నివేదికలో జత చేసింది చైల్డ్ ప్యానెల్. అంతేకాదు.. ఒకవేళ స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేస్తే.. పిల్లలను వేరే స్కూల్లో అడ్మిషన్తకు అనుమతించాలని సూచించింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శిస్తూ.. దళిత సంఘాలు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నాయి.  బిజెపి సైతం ఈ ఘటనను ఆధారంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది.

కాగా, ఆగస్ట్ 15న రాజస్థాన్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ప్రైవేట్ స్కూల్లో చెయిల్ సింగ్ అనే టీచర్ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్ల కుండను ఇంద్రకుమార్ మేఘవాలా అనే దళిత విద్యార్థి ముట్టుకున్నాడు. దీంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడిని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. జూలై 20న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ దెబ్బలతో తన కొడుకు చెవులు, కళ్లు, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయని, అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడని తండ్రి దేవరామ్ మేఘవాలా కన్నీటి పర్యంతమయ్యాడు. సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. టీచర్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?