బంగారం షాప్ లో సేల్స్ మెన్స్... రాత్రికి రాత్రే కోటేశ్వరులయ్యారు

By telugu teamFirst Published Sep 21, 2019, 8:43 AM IST
Highlights

కేరళకు చెందిన రొణ్ణి, వివేక్, రాజీవ్, సుబిన్ థామస్, రిమ్‌జిన్, రతీష్ అనే వ్యక్తులు కొల్లం జిల్లాలోని ఓ బంగారం షాపులో సేల్స్‌మె‌న్‌లుగా పనిచేస్తున్నారు. వీరందరూ తలాకొంత వేసుకుని రూ.300తో ఓ ఏజెంట్ వద్ద బుధవారం రాత్రి కేరళ ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ కొన్నారు.

అప్పటి వరకు నెల వారీ జీతంతో  బతుకులు ఈడ్చిన ఆరుగురు సేల్స్ మెన్స్ ఉన్నట్టుండి కోటీశ్వరులయ్యారు. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించేశారు. ఇలాంటి సంఘటనలు దాదాపు సినిమాల్లోనే జరుగుతూ ఉంటాయి. హీరోలు రాత్రికి రాత్రే కోట్లు సంపాదించేస్తారు. కానీ... కేరళలో ఇది నిజంగానే జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన రొణ్ణి, వివేక్, రాజీవ్, సుబిన్ థామస్, రిమ్‌జిన్, రతీష్ అనే వ్యక్తులు కొల్లం జిల్లాలోని ఓ బంగారం షాపులో సేల్స్‌మె‌న్‌లుగా పనిచేస్తున్నారు. వీరందరూ తలాకొంత వేసుకుని రూ.300తో ఓ ఏజెంట్ వద్ద బుధవారం రాత్రి కేరళ ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ కొన్నారు.
 
గురువారం వెలువడ్డ లాటరీ ఫలితాల్లో ఈ ఆరుగురు వ్యక్తులు కొన్న టికెట్‌కే జాక్‌పాట్ తగిలి రూ.12 కోట్లు గెలుచుకున్నారు. దీంతో వీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. దీనిపై స్పందించిన ఈ ఆరుగురు వ్యక్తులు.. రూ.12 కోట్లు గెలుచుకోవడంపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

click me!