కరోనా కలకలం: బీహార్ లో జడ్జి మృతి

By narsimha lode  |  First Published Aug 7, 2020, 2:49 PM IST

కరోనా సోకి ఓ జడ్జి శుక్రవారం నాడు మృతి చెందాడు. ఈ ఘటన  బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 
 


పాట్నా: కరోనా సోకి ఓ జడ్జి శుక్రవారం నాడు మృతి చెందాడు. ఈ ఘటన  బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో  ఫ్యామిలీ కోర్టులో హరిశ్చంద్ర శ్రీవాస్తవ ప్రిన్సిపల్ జడ్జిగా ఉన్నారు. ఆయన వయస్సు 58 ఏళ్లు.  శ్వాస సంబంధమైన సమస్యలతో ఆయన బుధవారం నాడు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరాడు. ఆయనను వైద్యులు పరీక్షిస్తే  కరోనా సోకినట్టుగా  తేలింది. అయితే అప్పటికే ఆయనకు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సోకినట్టుగా  వైద్యులు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు ఆయన మరణించాడు.

Latest Videos

శ్రీవాస్తవ మృతి తమకు తీరని లోటని బీహార్ జ్యూడీషీయల్ అసోసియేషన్ సెక్రటరీ  అజిత్ కుమార్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
 ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాలియా జిల్లా శ్రీనివాస్త‌వ స్వ‌స్థ‌లం.బీహార్ ప‌బ్లిక్ స‌ర్వీసెస్ క‌మిష‌న్ ద్వారా ఎంపికైన త‌ర్వాత 1995 డిసెంబ‌ర్ 16న న్యాయ‌వ్యాదిగా ప్ర‌స్థానం ప్రారంభించారు. అయితే 2022 జూలై 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి ఉండ‌గా కోవిడ్-19 బారిన పడి అకాల‌మ‌ర‌ణం చెందారు.

click me!