కశ్మీర్‌లో సాధారణ ప్రజల ఊచకోత.. రంగంలోకి సైన్యం, 570 మంది ఉగ్రవాదుల అరెస్ట్

By Siva KodatiFirst Published Oct 10, 2021, 4:57 PM IST
Highlights

జమ్మూకశ్మీర్‌లో (jammu kashmir) ఉగ్రవాదులపై (terrorists) సైన్యం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో సామాన్యులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసి హత్య చేస్తుండటంతో సైన్యం అప్రమత్తమైంది. 

జమ్మూకశ్మీర్‌లో (jammu kashmir) ఉగ్రవాదులపై (terrorists) సైన్యం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో సామాన్యులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసి హత్య చేస్తుండటంతో సైన్యం అప్రమత్తమైంది. ఆదివారం ఉగ్రవాదులకు, ఉగ్రవాద కార్యకలాపాల సానుభూతిపరులైన 70 మంది యువకులను అదుపులోకి తీసుకుంది. దీంతో కాశ్మీర్ వ్యాప్తంగా మొత్తం అరెస్టుల సంఖ్య 570కి చేరింది. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ను పర్యవేక్షించేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) (intelligence bureau) ఉన్నతాధికారిని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీనగర్‌కు (srinagar) పంపించింది.

జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టుల ఘాతుకం: ఇద్దరు టీచర్లను కాల్చి చంపిన టెర్రరిస్టులు

కాగా, జమ్మూకశ్మీర్‌లోని 15 కీలక ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) (nia) అధికారులు దాడులు చేశారు. గడిచిన ఐదు రోజుల్లో ఆరుగురు పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్, స్కూల్ టీచర్ ను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మఖన్ లాల్ బింద్రూ అనే ప్రముఖ కశ్మీరీ పండిట్, ఫార్మాసిస్ట్‌నూ పాయింట్ బ్లాంక్‌లో షూట్ చేసి దారుణంగా హత్య చేశారు. అలాగే మంగళవారం శ్రీనగర్‌లో బీహార్‌కు చెందిన వీరేంద్ర పాశ్వాన్ అనే చాట్ వ్యాపారి, బందీపొరాకు చెందిన మహ్మద్ షఫీలో నేను ఉగ్రవాదులు చంపేశారు

click me!