ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులు.. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికం.. షాకింగ్ డేటా..

By Sumanth KanukulaFirst Published Dec 7, 2022, 3:10 PM IST
Highlights

గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన సీబీఐ కేసుల వివరాలను కేంద్రం పార్లమెంట్‌లో వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనే కేసులు అత్యధికంగా ఉండటం గమనార్హం.

గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన సీబీఐ కేసుల వివరాలను కేంద్రం పార్లమెంట్‌లో వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనే కేసులు అత్యధికంగా ఉండటం గమనార్హం. వివరాలు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులకు సంబంధించిన డేటాను లోక్‌సభలో వెల్లడించింది. 2017 నుంచి 2022 అక్టోబర్ 31 వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలపై సీబీఐ 56 కేసులు నమోదు చేసిందని తెలిపింది. వాటిలో 22 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేయబడిందని పేర్కొంది. 

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీబీఐ 56 కేసులు నమోదు చేయగా.. అందులో 10 కేసులు ఏపీలో ఉన్నాయి. అదే సమయంలో మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఎలాంటి సీబీఐ కేసులు నమోదు కాలేదు. 

 

56 cases were registered by CBI against MLAs and MPs from 2017 to 2022 (up to 31.10.2022) out of which chargesheet were filed in 22 cases: Department of Personnel & Training (DoPT) in Lok Sabha pic.twitter.com/fRnKrfnR4l

— ANI (@ANI)

రాష్ట్రాల వారీగా కేసులను పరిశీలిస్తే.. హర్యానాలో 1, ఆంధ్రప్రదేశ్‌లో 10, కర్ణాటకలో 2, తమిళనాడులో 4, ఛత్తీస్‌గఢ్‌లో 1, పశ్చిమ  బెంగాల్‌లో 5, ఢిల్లీలో3, బిహార్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 6, మేఘాలయలో 1, మణిపూర్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 1, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 5, కేరళలో 6, జమ్మూ కశ్మీర్‌లో 2, మధ్యప్రదేశ్‌లో 1, మహారాష్ట్రలో 1, లక్షద్వీప్‌లో 1 నమోదయ్యాయి. 

click me!