ఆకలిగా ఉంది, ఇంకో ఇడ్లీ పెట్టమని అడిగి.. కరోనా బాధితుడు..

By telugu news teamFirst Published Apr 29, 2020, 9:56 AM IST
Highlights

సిబ్బంది కన్నుగప్పి, ఐసియు నుండి బయటకు వచ్చి, ఫైర్ ఎగ్జిట్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద శబ్దం వినగానే ఆసుపత్రి సిబ్బంది బయటకు వచ్చి చూశారు. అప్పటికే అతను మరణించాడు. 

కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు.. బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా.. ఆత్మహత్యకు ముందు బాధితుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. తనకు బాగా ఆకలిగా ఉందని.. ఇంకో ఇడ్లీ పెట్టమని వైద్య సిబ్బందిని అతను కోరడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... కరోనా సోకిన వ్యక్తి బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ లోని ట్రామా కేర్ సెంటర్ బిల్డింగ్ పైనుండి  దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దక్షిణ బెంగళూరులోని తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

అతనికి ఆహారం అందిస్తున్నప్పుడు ఇంకో ఇడ్లీ కావాలని కోరాడు. వాళ్లు నిజమని నమ్మి ఇడ్లీ తేవడానికి వెళ్లేలోపు.. సిబ్బంది కన్నుగప్పి, ఐసియు నుండి బయటకు వచ్చి, ఫైర్ ఎగ్జిట్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద శబ్దం వినగానే ఆసుపత్రి సిబ్బంది బయటకు వచ్చి చూశారు. అప్పటికే అతను మరణించాడు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం  ఏప్రిల్ 24 న  ఆటో డ్రైవర్ ను పాజిటివ్‌గా గుర్తించారు. ఐసియులో చేరిన అతను ఒక మహిళా కరోనా రోగి మరణించడంతో షాక్ అయ్యాడు. దీనితో ఉదాసీనంగా మారిపోయాడు. 

మరోవైపు ఆటో డ్రైవర్‌కు దీర్ఘకాలిక మూత్రపిండ రుగ్మత, రక్తపోటు హెపటైటిస్ సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆందోనళకులోనై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. 

click me!