Presidential Election 2022: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాల కమిటీ.. ఎటు తేల్చుకోలేక‌పోతున్న విపక్షాలు

Published : Jun 16, 2022, 04:50 AM IST
Presidential Election 2022: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాల కమిటీ.. ఎటు తేల్చుకోలేక‌పోతున్న విపక్షాలు

సారాంశం

Presidential Election 2022:  రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిత్వానికి సంబంధించి ఈరోజు జరిగిన విపక్షాల సమావేశంలో ఎవరి పేరును నిర్ణయించలేదు. సమావేశంలో, అన్ని పార్టీలు శరద్ పవార్ పేరును సూచించాయి, అయితే సమావేశానికి హాజరైన పవార్ స్వయంగా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు  

Presidential Election 2022: భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు చాలా ఆసక్తిక‌రంగా సాగుతున్నాయి. అధ్య‌క్ష పీఠంపై త‌మ అభ్య‌ర్థిని కూర్చోబెట్టాలిన అధికార బీజేపీ చూస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడి అభ్యర్థిని బ‌రిలో  దించాల‌ని భావిస్తున్నాయి. ఈ మేర‌కు బుధ‌వారం విపక్ష పార్టీలు ఓ కమిటీని ఏర్పాటు చేశాయి.  

ఈ క‌మిటీలో తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్ సభ్యులుగా ఉన్నారు. బుధ‌వారం మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్ష పార్టీల నేతలు ఢిల్లీలో సమావేశ‌మ‌య్యారు. రాష్ట్ర‌ప‌తిఎన్నికల ఎజెండాతో భేటీ జ‌రిగినా..  రాష్ట్రపతి అభ్యర్థి అంశం ఎటూ తేల్చ‌లేక‌పోయారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాక.. రాష్ట్రపతి అభ్యర్థిపై త్వరలోనే ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు స‌మాచారం.
 
ఈ స‌మావేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ ను బ‌రిలో దిగాలని మమత విజ్ఞప్తి చేసినా.. ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించారు. తాను క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతాన‌నీ,  తానకు రాష్ట్ర‌ప‌తి ప‌దవిపై ఆస‌క్తి  ఇష్టపడుతున్నట్టు వెల్లడించారు. మ‌రోవైపు.. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు కూటమిగా ఏర్పాడి.. సంఖ్యాబ‌లాన్ని కూడ‌గ‌ట్టుకుని విజ‌యం సాధిస్తామ‌నే నమ్మకం  లేకపోవడం వల్లే శ‌రాద్ పవార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పవార్‌ విముఖంగా ఉండటంతో మరో ఇద్దరి పేర్లను మమత ప్రతిపాదించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత  ఫరూక్ అబ్దుల్లా, బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ గోపాల్ కృష్ణ గాంధీ పేర్లను కూడా మమతా బెనర్జీ ప్రతిపాదించారు. కానీ, మ‌మ‌తా ప్ర‌తిపాద‌న‌పై ఎవ‌రూ స్పందించ‌లేరు.

దీంతో స‌మావేశంలో కాస్త అస్ఫ‌ష్టత ఏర్పడింది.  దీంతో మరోసారి భేటీ కావాల‌ని నిర్ణ‌యించారు. కేవ‌లం  రెండు గంటల్లోనే సమావేశం ముగిసింది. తదుపరి సమావేశం జూన్ 20న లేదా 21న పవార్‌ నేతృత్వంలో ముంబైలో మరో సమావేశం జరుగనున్నట్టు సమాచారం. ఈ స‌మావేశ ఆహ్వానితుల్లో ఐదుగురు సభకు రాకపోవడంతో అనుకున్న స్థాయిలో స‌మావేశం జ‌ర‌గ‌లేదు. ఈ పార్టీలలో ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), బిజూ జనతాదళ్, అకాలీదళ్ మరియు YSR కాంగ్రెస్ ఉన్నాయి.రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు విపక్షాలు జూన్‌ 21 డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టు స‌మాచారం. రాష్ట్రపతి పదవికి రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తి అవసరమని నేటి సమావేశంలో తీర్మానం చేశారు. ఈ స‌మావేశానికి బీఎస్పీ, టీడీపీ వంటి పార్టీలకు ఆహ్వానం అందకపోవడంతో సమావేశానికి దూరంగా ఉన్నారు. 

ప‌లు మీడియా క‌థ‌నాల ప్ర‌కారం..ఈ సమావేశంలో మమతా బెనర్జీ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థల ద్వారా, ప్రతిపక్ష రహిత భారతదేశాన్ని రూపొందించే ఎజెండాపై బిజెపి పనిచేస్తోందని, ప్రతిపక్ష నాయకులను మాత్రమే సెలెక్టివ్‌గా టార్గెట్ చేస్తున్నారని అన్నారు. బుల్‌డోజర్ వివాదంపై మమత మాట్లాడుతూ.. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా.. అక్రమంగా బుల్‌డోజర్లను ప్రయోగిస్తున్నారని అన్నారు. 

విపక్ష నేతలకు రాజ్‌నాథ్‌ ఫోన్‌

రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఏకగ్రీవం చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయమై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ .. మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాజ్‌నాథ్ సింగ్ ముందు ఎన్డీయే అభ్యర్థి పేరు చెప్పాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతున్నట్టు విపక్ష నేతలు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం