స్వస్థలానికి చేరిన... 50మంది వలస కార్మికులకు కరోనా

By telugu news team  |  First Published May 20, 2020, 10:26 AM IST

ఇంటికి చేరిన వలస కార్మికులలో కొందరిని కరోనా పీడిస్తోంది. తాజాగా 50మంది  వలస కూలీలకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు  ఇలా ఉన్నాయి.


దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ ని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించగా.. వలస కార్మికులు నానా అవస్థలు పడ్డారు. కొందరు నడుచుకుంటూనే ఇంటికి చేరారు. కాగా.. వారి బాధలు గుర్తించిన కేంద్రం వారి కోసం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా కొందరైనా తమ స్వగ్రామాలకు చేరుకోగలిగారు.

అయితే.. ఇంటికి చేరిన వలస కార్మికులలో కొందరిని కరోనా పీడిస్తోంది. తాజాగా 50మంది  వలస కూలీలకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు  ఇలా ఉన్నాయి.

Latest Videos

మహారాష్ట్ర నుంచి తమ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్న 50 మంది వలస కార్మికులు కరోనా బారిన పడ్డారు. వారు పూణె నుంచి బస్తీకి జిల్లాకు వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు స్థానిక జిల్లా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

 దీనితో రాష్ట్రంలో కరోనా సోకిన వలస కార్మికుల సంఖ్య 109కి చేరింది. వలస కార్మికుల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడం అక్కడి అధికారులను ఆందోళన పెంచుతోంది. వివిధ రాష్ట్రాలనుంచి ఉత్తరప్రదేశ్‌కు తిరిగి వస్తున్న కార్మికుల సంఖ్య లక్షల్లో ఉండటంతో కేసులు సంఖ్య మరింతగా పెరుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. 

లాక్ డౌన్ కారణంగా వీరంతా దాదాపు 2 నెలల పాటు వేరు వేరు ప్రాంతాల్లో ఉండిపోయారని, దీంతో  వారు ఎవరెవరినీ కలుసుకున్నారనే దాన్ని గుర్తించడం కష్టమైన పని అని ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

click me!