టిక్ టాక్ కోసం గంగానదిలో దూకి 5గురు యువకుల మృతి

By Sree sFirst Published May 30, 2020, 12:43 PM IST
Highlights

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ వల్ల ప్రజలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ సోషల్ మీడియా యాప్ వల్ల అయిదుగురు యువకులు ఏకంగా గంగానదిలోకి దూకి మరణించిన సంఘటన అందరిని షాక్ కి గురి చేసింది. 

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ వల్ల ప్రజలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ సోషల్ మీడియా యాప్ వల్ల అయిదుగురు యువకులు ఏకంగా గంగానదిలోకి దూకి మరణించిన సంఘటన అందరిని షాక్ కి గురి చేసింది. 

 వివరాలోకి వెళితే... యూపీలోని వారణాసిలో టిక్ టాక్ కోసం ఐదుగురు యువకులు గంగ నదిలోకి దూకారు. అలా టిక్ టాక్ చేసేందుకు ప్రవహిస్తున్న నదిలోకి దూకిన యువకులు శవాలై ఒడ్డుకు చేరారు. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం టిక్ టాక్ వీడియో తీసేందుకు ఆ యువకులంతా గంగ నదిమధ్యలో చిన్నగా ఇసుక ఎక్కువగా మేటలేయడంతో అక్కడ వీడియో చేసేందుకు 5గురు కుర్రాళ్ళు అక్కడకు వెళ్లారు. వారంతా అక్కడకు చేరుకోని వీడియో చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒక అబ్బాయి నదిలో జారిపడి కొట్టుకుపోవడం ప్రారంభించాడు.

అతడిని రక్షించేందుకు మరొకరు, అతడి కోసం మరొక అతను ఇలా అందరూ కూడా నదిలోకి దూకి తమ ప్రాణాలను కోల్పోయారు. 

చుట్టుపక్కలవారు ఈ యువకులను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారు కాపాడలేకపోయారు. వీరిహాహాకారాలు విన్న స్థానిక జాలర్లు పడవల్లో అక్కడకు వెళ్ళేసరికే వారంతా మునిగిపోయి మరణించారు. 

 పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లు సహాయంతో మృతదేహాలను నీటిలో నుండి వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. 

మృతులను తౌసిఫ్ (19), ఫర్దీన్ (14), సైఫ్ (15), రిజ్వాన్ (15) సాకి (14) గా గుర్తించారు.ఈ ఘటనపై అధికారి సంజయ్ త్రిపాఠి మాట్లాడుతూ.. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.వీరంతా టిక్ టాక్ చేసేందుకు దూకి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని తెలిపారు. వేరే యువత ఎవరూ ఇలా టిక్ టాక్ మోజులోపడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. 

ఇకపోతే.... భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్యా రెండు లక్షలకు చేరువౌతోంది. శుక్రవారం ఉదయం 8గంటల సమయానికి  1,73,763 కేసులు నమోదైనట్టు అధికారులు చెప్పారు.

గత 24 గంటల్లో 8వేలకు పైగా కేసులు నమోదయినట్టు అధికారులు చెప్పారు. 

ఇప్పటివరకు 82,369మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా 4,971 మంది మరణించారని తెలియవస్తుంది.  ఒక్కరోజే  మంది 200 మందికి పైగా ఈ కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం 89,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ప్రస్తుతం భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలో 9వ స్థానికి చేరుకుంది. అమెరికా మొదటి స్థానంలో ఉంది. కాగా.. మరణాల్లోనూ భారత్ చైనాని దాటేయడం గమనార్హం.

మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి..

కాకపోతే ఇక్కడ ఒక ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే... రికవరీ రేట్. మార్చ్ లో 7.1 శాతంగా రికవరీ రేట్ ఉండగా అది నేడు 42.75 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్ మరణాల్లో కూడా గతంలో 3.3 శాతంగా ఉండగా అది  2.87 గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్ పట్ల సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండండని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.... కొందరి నిర్వాకం వల్ల మాత్రం ఈ వైరస్ వ్యాపిస్తునే ఉంది. 

click me!