కావేరీ నదిలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతు

First Published Jul 22, 2018, 4:45 PM IST
Highlights

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉదృతంగా ప్రవహిస్తున్న కావేరీ నదిలో స్నానానికి దిగి ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, వారితో కలిసి వెళ్లిన మరో ఇద్దరు కూడా ప్రాణాలు విడిచారు. ఓ యువతి మాత్రం ఈ ప్రమాదం నుండి బైటపడింది. ఈ ఘటన తమిళ నాడు లోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది.

శరవణన్,మైథిలి దంపతులు తొమ్మిదేళ్ల వయసున్న కొడుకు హరిహరన్ ని తీసుకుని సేలం జిల్లాలోని బంధువలు వద్దకు వెళ్లారు. ఇవాళ సెలవురోజు కావడంతో సరదాగా గడపాలని భావించిన వీరు బంధువులు థనుశ్రీ, వాణిశ్రీ, రేవణ్ణ లతో కలిసి కావేరీ నదీ తీరానికి వెళ్లారు. అయితే కావేరీ నది వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నప్పటికి వీరు అందులో స్నానానికి దిగారు. దీంతో ఈ నీటి ప్రవాహానికి తట్టుకోలేక అందరూ ఒక్కసారిగా కొట్టుకుపోయారు. అయితే వీరిలో కేవలం ఈత వచ్చిన వ్యక్తి థనుశ్రీ మాత్రమే. ఈమె అతికష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. మిగతా ఐదుగురు మాత్రం నదీనీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది నదిలో గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టారు.  గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటివరకు కొట్టుకుపోయిన ఐదుగురి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.

click me!