వ్యాపారవేత్త ఇంట్లో రూ.2 కోట్ల దోపిడి... పనిమనుషులతో సహా ఐదుగురు పక్కా ప్లాన్ తో...

By AN TeluguFirst Published Nov 6, 2021, 9:24 AM IST
Highlights

నిందితులు ఓనర్ హర్మీత్ అరోరాను బెదిరించి ఇంటిని దోచుకున్నారని, ఆమె కొడుకుతో పాటు ఆమెను ఇంట్లో బంధించారని పోలీసులు తెలిపారు.

న్యూఢిల్లీ : ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో ఓ వ్యాపారి ఇంట్లో ఐదుగురు వ్యక్తులు రూ.2 కోట్ల నగదు, నగలు దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోపిడీపై బాధితురాలు హర్మీత్ అరోరా మంగళవారం సాయంత్రం 6 గంటలకు పీసీఆర్ కాల్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... victim  హర్మీత్ అరోరా ఇంట్లో పనిచేసే ఇద్దరు పనిమనిషిలతో పాటు మరో ముగ్గురు మగ స్నేహితులు వీరికి సాయం చేశారు. దీంతో మొత్తం ఐదుగురు robbery plan చేశారని.. దాని ప్రకారమే ఇంట్లో వాళ్లను బెదిరించి ఐదుగురు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు.

నిందితులు ఓనర్ హర్మీత్ అరోరాను బెదిరించి ఇంటిని దోచుకున్నారని, ఆమె కొడుకుతో పాటు ఆమెను ఇంట్లో బంధించారని పోలీసులు తెలిపారు.

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 392, సెక్షన్ 397, సెక్షన్ 34 కింద పశ్చిమ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉంది. కేసు విచారణ జరుగుతోంది.

మాజీ మంత్రిని గుడిలోనే బంధించిన రైతులు.. క్షమాపణలు చెప్పి బయటకు వచ్చిన బీజేపీ నేతలు!

వృద్ధదంపతుల్ని కిరాతకంగా చంపి....
ఉత్తరప్రదేశ్ లోని ఓ జంటకు దీపావళి కాళరాత్రిగా మారింది. వృద్ధ దంపతుల పాలిట కర్కశంగా మారింది. అందరూ సంతోషంగా దీపాలు వెలిగించి, పటాకులు కాల్చుకుని సంబరాలు జరుపుకుంటుంటే.. వారు మాత్రం నరకయాతన అనుభవించారు. 

దీపావళి రోజు శుక్రవారం ((నవంబర్ 5) రాత్రి ఘజియాబాద్‌లోని పటేల్ నగర్‌లో నివసిస్తున్న వృద్ధ దంపతులిద్దరు వారి ఇంట్లోనే brutally murderedకు గురయ్యారు. హత్య చేయడానికి ముందు వారిని అతి కిరాతకంగా కొట్టి మరీ చంపినట్లు  పోలీసులు తెలిపారు. 

ఘజియాబాద్ లో దంపతులిద్దరూ ఒంటరిగా ఉంటున్నారు. వీరి కుమార్తెలో నోయిడాలో నివసిస్తున్నారు. కూతుర్లలో ఒకరు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వారు ఎత్తలేదు. అలా చాలాసార్లు ఫోన్లు చేసినా వారినుంచి స్పందన లేదు. దీంతో కంగారు పడిన కూతురు. తల్లిదండ్రుల పక్కింటి వారికి ఫోన్ చేసి.. ఒకసారి ఏం జరిగిందో చూడమని అభ్యర్థించింది. 

వెంటను ఇరుగుపొరుగు వారు... ఇంటికి వెళ్లి చూడగా జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (II) నిపున్ అగర్వాల్ తెలిపారు.

కుమార్తె ఫోన్ కాల్ తో ఇరుగు పొరుగు వారు దంపతుల నివాసానికి చేరుకునే సరికి.. వారింటి తలుపులు తెరిచి ఉన్నాయని.. 72 ఏళ్ల medicine dealer అశోక్ జైద్కా, అతని భార్య మధు జైద్కా మృతదేహాలు ఇంటి లోపల రక్తపు మడుగులో పడి ఉన్నాయని ఆయన తెలిపారు. 

అది చూసి షాక్ అయిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారని.. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను post mortem నిమిత్తం తరలించినట్లు ఎస్పీ తెలిపారు. దీపావళి రోజు రాత్రి 9 గంటల సమయంలో దంపతులు blunt objectతో కొట్టి చంపారని అగర్వాల్ తెలిపారు.
 

click me!