నీట్: అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్ధినికి మరణ శాసనం

By Siva KodatiFirst Published Oct 23, 2020, 2:29 PM IST
Highlights

దేశవ్యాప్తంగా వైద్య విద్యకు సంబంధించిన కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహిస్తున్న నీట్ పరీక్షలో అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్ధిని ప్రాణాలను బలి తీసుకుంది.

దేశవ్యాప్తంగా వైద్య విద్యకు సంబంధించిన కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహిస్తున్న నీట్ పరీక్షలో అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్ధిని ప్రాణాలను బలి తీసుకుంది.

వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌కు చెందిన విధి సూర్యవంశీ అనే అమ్మాయి నీట్‌లో మంచి మార్కులు వస్తాయని ఊహిస్తే ఫలితాల్లో కేవలం 6 మార్కులే రావడంతో షాక్‌కు గురైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విధి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

అయితే తమ కుమార్తెకు ఇంత తక్కువ మార్కులు వస్తాయని మృతురాలి తల్లిదండ్రులు సైతం నమ్మలేకపోయారు. దీంతో వారు ఓఎంఆర్ సీటును తెప్పించి చూడగా.. విధికి 720కి గాను, 590 మార్కులు వచ్చి, ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణురాలైనట్లు తేలింది. విధి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, నీట్ 2020 ఫలితాలను అక్టోబర్ 16న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఒడిశాకు చెందిన సోయెబ్ అఫ్తాబ్, ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్ నీట్ ఎంట్రన్ 2020లో 720 మార్కులకు గాను 720 మార్కులు సాధించి చరిత్ర సృష్టించారు.

అలిండియా స్థాయిలో 15,97,435 మంది విద్యార్ధులు నీట్ పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 13,66,945 (85.97 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. 

click me!
Last Updated Oct 23, 2020, 2:29 PM IST
click me!