ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్.. ఐదుగురి మృతి

Published : Jan 26, 2021, 09:40 AM IST
ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్.. ఐదుగురి మృతి

సారాంశం

గోపిగంజ్ లోని కొత్వాలి ప్రాంతంలోని అమ్వా గ్రామం సమీపంలో చిత్తోర్ గఢ్ వెళుతున్న అంబులెన్సు స్టేషనరీ ట్రక్కును ఢీకొంది. 

వేగంగా వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి.. ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదోహి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ అంబులెన్సు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం చెందిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహిలో మంగళవారం ఉదయం జరిగింది.గోపిగంజ్ లోని కొత్వాలి ప్రాంతంలోని అమ్వా గ్రామం సమీపంలో చిత్తోర్ గఢ్ వెళుతున్న అంబులెన్సు స్టేషనరీ ట్రక్కును ఢీకొంది. 

ఈ దుర్ఘటనలో అంబులెన్సులో ఉన్న ఐదుగురు మరణించారని యూపీ పోలీసులు చెప్పారు. చిత్తోర్ ఘడ్ కు వేగంగా అంబులెన్సు వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కాగా.. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. కాగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు