ఢిల్లీలో అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఐదుగురు అరెస్ట్..!

Published : Sep 22, 2021, 07:49 AM IST
ఢిల్లీలో అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఐదుగురు అరెస్ట్..!

సారాంశం

కిటికీ అద్దాలు కూడా పగలగొట్టారు. ప్రహరీ గోడ, గేటును కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఓవైసీ ఇంటి వద్దకు చేరుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.


ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై కొందరు దుండగులు దాడికి  పాల్పడ్డారు. ఢిల్లీలోని అశోక రోడ్డులో ఉన్న ఆయన ఇంటిపై కొందరు దాడి చేశారు. కిటికీ అద్దాలు కూడా పగలగొట్టారు. ప్రహరీ గోడ, గేటును కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఓవైసీ ఇంటి వద్దకు చేరుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై డీసీపీ దీపక్ యాదవ్ మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడికి పాల్పడిన మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. ఎంపీ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలతో కోపం పెంచుకొని ఈ దాడికి పాల్పడినట్లు నిందితులు తమ విచారణలో అంగీకరించినట్లు డీసీపీ వివరించారు. తదుపరి విచారణ ఇంకా కొనసాగుతోందని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం