ఇండియాలో కరోనా జోరు: 24 గంటల్లో 4205 మంది మృతి

By narsimha lodeFirst Published May 12, 2021, 10:11 AM IST
Highlights

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 3,48,421 కరోనా కేసుుల నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,33,40,938కి చేరుకొన్నాయి. కరోనా నుండి దేశంలో ఇప్పటివరకు 1,93,82,642 మంది కోలుకొన్నారు.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 3,48,421 కరోనా కేసుుల నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,33,40,938కి చేరుకొన్నాయి. కరోనా నుండి దేశంలో ఇప్పటివరకు 1,93,82,642 మంది కోలుకొన్నారు.24 గంటల్లో 4205 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,54,197కి చేరుకొన్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో 4365 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 7531 మంది కోలుకొన్నారు. 24 గంల్లో 103 మంది మరణించారు. 

దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 83.04 శాతానికి చేరింది. నిన్నటి నుండి దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. నిన్నటితో పోలిస్తే దేశంలో 11 వేల కరోనా కేసులు తగ్గాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 15.87 శాతంగా ఉంది. మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. దేశంలో కోరోనాను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు ఇప్పటికే పూర్తిస్థాయి లాక్‌డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ పాక్షిక లాక్‌డౌన్ లను అమలు చేస్తున్నాయి. 

click me!