గంగానదిలో శవాలు : యూపీనుంచి కొట్టుకొచ్చినవే.. బీహార్..

By AN TeluguFirst Published May 12, 2021, 9:26 AM IST
Highlights

గంగానదిలో మృతదేహాలు కుప్పలుగా కొట్టుకువచ్చిన వ్యవహారంపై బీహార్ ప్రభుత్వం మంగళవారం స్పందించింది. అవన్నీ ఉత్తరప్రదేశ్ నుంచి తమ రాష్ట్రానికి నీటి ప్రవాహం ద్వారా చేరాయని తెలిపింది. బక్సర్ జిల్లాలో గంగా తీరం వెంబడి మొత్తం 71 మృతదేహాలను వెలికి తీశామని జలవనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ చెప్పారు.

వాటన్నింటికీ పోస్టుమార్టం నిర్వహించి, ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశామని వెల్లడించారు. మృతదేహాలు కోవిడ్ బాధితులవేనని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు. 

మరోవైపు గంగానదిలో మృతదేహాల కలకలం కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లోని బలియా, గాజీపూర్ జిల్లాల్లో పదుల సంఖ్యలో శవాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. బలియా జిల్లాలోని ఉజియార్, కుల్హడియా, భరూలీ ఘాట్ లకు కనీసం 45 మృతదేహాలు కొట్టుకు వచ్చాయి.

కాగా, రెండురోజుల క్రితం బీహార్‌లోని బక్సర్ జిల్లాలో  గంగానదిలో మృతదేహలు కలకలం రేపాయి. గంగానదిలో కిలోమీటరు పరిధిలో పదుల సంఖ్యలో మృతదేహాలు  నీటిలో తేలియాడుతున్నాయి. కరోనాతో మరణించిన రోగుల సంఖ్యను తగ్గించి చూపడానికి నదిలో డెడ్‌బాడీలను నదిలో వేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 

అయితే  గంగానదిలో కిలోమీటరు పరిధిలో మృతదేహాలు ఎక్కడివనే విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ విషయమై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని యమునా నదిలో కూడ ఇదే రకమైన పరిస్థితి కన్పించింది. రాష్ట్రంలోని హామీర్‌పుర్  జిల్లాలో ఈ తరహ దృశ్యాలు కన్పించాయి.  

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా మృతులు పెరుగుతున్న కారణంగా  నదిలో డెడ్‌బాడీలు వేస్తున్నారనే అనుమానాలు కూడ లేకపోలేదు. అంత్యక్రియల నిర్వహణకు భయపడి నదిలో మృతదేహాలను వదిలేస్తున్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

click me!