రేపటి నుంచి బెంగళూరు టెక్ సమ్మిట్: ప్రారంభించనున్న మోడీ

By Siva KodatiFirst Published Nov 18, 2020, 10:01 PM IST
Highlights

బెంగళూరు టెక్ సమ్మిట్ - 2020ని రేపు ఉదయం 11:00 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు

బెంగళూరు టెక్ సమ్మిట్ - 2020ని రేపు ఉదయం 11:00 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. బెంగళూరు టెక్ సమ్మిట్ నవంబర్ 19 నుండి 21 వరకు జరుగుతుంది.

కర్ణాటక ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సొసైటీ (కిట్స్), కర్ణాటక ప్రభుత్వ విజన్ గ్రూప్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ & స్టార్టప్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఇండియా (ఎస్‌టిపిఐ), ఎంఎం యాక్టివ్ సైన్స్-టెక్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో జరగనుంది.

ఈ సమ్మిట్‌లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, స్విట్జర్లాండ్ వైస్ ప్రెసిడెంట్ పార్మెలిన్‌తో పాటు ఇతర అంతర్జాతీయ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు కూడా పాల్గొననున్నారు.

ఈ ఏడాది ‘‘ నెక్స్ట్ ఈజ్ నౌ’’ థీమ్‌తో సమ్మిట్ జరగనుంది. 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్, 'బయోటెక్నాలజీ' డొమైన్లలో ప్రధాన సాంకేతికతలు మరియు ఆవిష్కరణల ప్రభావంపై దృష్టి సారించి, కరోనా అనంతరం ప్రపంచంలో ఉద్భవిస్తున్న సవాళ్ళపై శిఖరాగ్ర చర్చ జరుగుతుంది.

click me!