గంగానది ప్రక్షాళన...కోరిక తీరకుండానే మరణించిన స్వామి జ్ఞాన స్వరూప్

By Nagaraju TFirst Published Oct 11, 2018, 8:39 PM IST
Highlights

గంగానది ప్రక్షాళన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు గంగానది ప్రక్షాళన పోరాట యోధుడు స్వామి జ్ఞాన స్వరూప్ సనంద మృతి చెందారు. తన చిరకాల వాంఛ అయిన గంగానది ప్రక్షాళన కోరిక తీరకుండానే గుండె పోటుతో తనువు చాలించారు. గంగానది ప్రక్షాళన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ 111 రోజులుగా స్వామి జ్ఞాన స్వరూప్ సనంద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. 

ఢిల్లీ: గంగానది ప్రక్షాళన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు గంగానది ప్రక్షాళన పోరాట యోధుడు స్వామి జ్ఞాన స్వరూప్ సనంద మృతి చెందారు. తన చిరకాల వాంఛ అయిన గంగానది ప్రక్షాళన కోరిక తీరకుండానే గుండె పోటుతో తనువు చాలించారు. గంగానది ప్రక్షాళన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ 111 రోజులుగా స్వామి జ్ఞాన స్వరూప్ సనంద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. 

గంగానది కాలుష్య కోరల నుంచి విడిపించి స్వేచ్ఛగా ప్రవహించేలా చెయ్యాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీక్ష కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఉత్తరాఖండ్ పోలీసులు బుధవారం రాత్రి రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న స్వామి జ్ఞాన స్వరూప్ సనందకు గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు ఎయిమ్స్ మీడియా కో ఆర్డినేటర్ వెల్లడించారు. 
 
స్వామి జ్ఞాన స్వరూప్ సనంద అసలు పేరు జీడీ అగర్వాల్. ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా రిటైరైన తర్వాత తన పేరును స్వామి జ్ఞాన స్వరూప్ సనందగా మార్చుకున్నారు. గంగానది పరివాహ ప్రాంతాల్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు నిర్మించడం ఆపెయ్యాలంటూ పోరాటబాట పట్టారు. 2012లో గంగా నది ప్రక్షాళన కోరుతూ ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 

దాదాపు రెండున్నర నెలల పాటు ఆయన నిరాహార దీక్ష చేయడంతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్పందించింది. హుటాహుటిన అగర్వాల్ డిమాండ్లపై చర్చించేందుకు జాతీయ గంగానదీ పరీవాహక యాజమాన్యం (ఎన్‌జీఆర్‌బీఏ)తో సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా అగర్వాల్ మెంబర్ సెక్రటరీగా సేవలందించారు. 

click me!