కొంపముంచిన రీల్స్.. నలుగురు మహిళా కానిస్టేబుళ్ల సస్పెండ్ 

By Rajesh KarampooriFirst Published Dec 16, 2022, 11:22 AM IST
Highlights

అయోధ్య రామజన్మభూమి సైట్‌లో విధులు నిర్వహిస్తున్న నలుగురు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో వారిపై సస్పెండ్ చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

ప్రస్తుతం ఇష్టానుసారంగా వీడియోలు రికార్డు చేయడం. సోషల్ మీడియాలో పోస్టు చేయడం ట్రెండ్ గా మారింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యేందుకు కొందరు బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారు. యువత అలా చేశారంటే.. వారంతేనని అనుకోవచ్చు. కానీ.. బాధ్యతయుతమైన పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్న నలుగురు మహిళ కానిస్టేబుల్స్ తమ బాధ్యతలను విస్మరించారు. పవిత్రమైన రామజన్మభూమి సైట్‌లో భద్రత విధులు నిర్వహిస్తూ.. అశీలమైన సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. అంతటీతో ఆగకుండా రికార్డు చేసిన ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఈ వీడియోలో ఉన్నది పోలీసు కానిస్టేబుళ్లని తెలిసింది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని పోలీస్ డిపార్ట్ మెంట్ లో కలకలం చేలారేగింది. సదరు మహిళ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. 

వివరాల్లోకెళ్లే.. రామజన్మభూమి సైట్‌లో డిసెంబర్ 6 న మహిళ కానిస్టేబుళ్లు కవితా పటేల్, కామినీ కుష్వాహ, కాశిష్ సాహ్ని, సంధ్యా సింగ్‌లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలొ బాధ్యతలు మరిచిన ఆ నలుగురు మహిళ కానిస్టేబుల్ .. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోన్న 'పాటలీ కమరియా' పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను రీల్ గా తయారు చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ క్లిప్‌ వేగంగా వైరల్ కావడం.. ఆ రీల్స్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులనీ, అది కూడా పోలీసు డిపార్ట్మెంట్ లోని వారని తేలింది. అదికూడా రామజన్మభూమిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో బాధ్యత రహిత్యంగా వ్యవహరించారని తెలియడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారిపై  విచారణ జరిపి..శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
పోలీసు కమిషనర్‌ చర్యలు 

ఈ విషయం అయోధ్య పోలీస్ కమిషనర్ మునిరాజ్ జీ దృష్టికి చేరింది. బాధ్యత రహితంగా వ్యవహరించిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లపై శాఖాపరమైన విచారణకు పోలీసు కమిషనర్ ఆదేశించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణా రహిత్యాన్ని ఎట్టి పరిస్థితిలో సహించబోమని ఆయన తన వీడియో స్టేట్‌మెంట్లలో తెలిపారు. గతంలో మొరాదాబాద్‌లో మహిళా పోలీసు సిబ్బంది కూడా తమ విధులను మరిచి టిక్ టాక్ లో  సంఝో జరా తుమ్... మౌసమ్ కా ఇషారా... పాటపై రీల్‌ను రూపొందించారు.ఈ వీడియో బయటకు రావడంతో సదరు మహిళా కానిస్టేబుల్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.

click me!