జమ్మూకాశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు..

Published : Jul 18, 2023, 10:19 AM IST
జమ్మూకాశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు..

సారాంశం

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టుబెట్టాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టుబెట్టాయి. పూంచ్‌లోని సింధారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా సైన్యం, పోలీసులు ..సోమవారం రాత్రి సూరంకోట్ బెల్ట్‌లోని సింధారా టాప్ ఏరియాలో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఇది భద్రత బలగాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులకు దారితీసింది. 

సోమవారం రాత్రి 11:30 గంటలకు భద్రతా బలగాల మధ్య తొలుత కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత డ్రోన్‌లతో పాటు ఇతర రాత్రి నిఘా పరికరాలను భద్రత బలగాలు మోహరించాయి. అయితే మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు, కాల్పులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. 

 

‘‘తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరగడంతో మళ్లీ ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. భారత సైన్యం ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసు దళాలతో పాటు ఇతర దళాలు ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉన్నాయి. ఈ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదులు విదేశీ ఉగ్రవాదులే. వారి గుర్తింపును పరిశీలిస్తున్నాం’’ అని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఇంకా ఆ ప్రాంతంలో  సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా  పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?