పంజాబ్‌లో మరో నలుగురు ఎమ్మెల్యేలకి కరోనా: మొత్తం 33 మందికి కోవిడ్

By narsimha lode  |  First Published Sep 3, 2020, 12:22 PM IST

పంజాబ్ రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.  రాష్ట్రంలోని 117 మంది ఎమ్మెల్యేల్లో 33 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.


న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.  రాష్ట్రంలోని 117 మంది ఎమ్మెల్యేల్లో 33 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

రణదీప్ నభా, ఆంగడ్ సింగ్, అమన్ ఆరోరా, పరంధీర్ ధిండ్సా కరోనా బారినపడినట్టుగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు.ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా నుండి  వీరంతా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

Latest Videos

undefined

also read:24 గంటల్లో ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 38,53,407కి చేరిక

కరోనాకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులను ఉపయోగించాలని సీఎం కోరారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య గురువారం నాటికి 38 లక్షలను దాటింది. ఇప్పటివరకు కరోనా సోకి కోలుకొన్న వారి సంఖ్య 29 లక్షలను దాటినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

గత 24 గంటల్లో దేశంలో 83,883 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 83,883 కరోనా కేసులు నమోదు కావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

click me!