
మిజోరాంలోని ఐజ్వాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్ జిల్లా తుయిరియాల్ వద్ద పెట్రోల్ తో వెళ్తున్న ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు ఐజ్వాల్ ఎస్పీ సి లాల్రువా మీడియాతో తెలిపారు. ఈ ఘటనలో ఓ ట్యాక్సీ, ద్విచక్ర వాహనాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.