జైపూర్ బాంబు పేలుడు కేసులో నలుగురిని దోషులుగా తేల్చింది కోర్టు. మరోకరికి విముక్తి కల్పించింది.
జైపూర్: జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని కోర్టు దోషులుగా తేల్చింది.ఈ కేసులో ఒకరిని నిర్ధోషిగా తేల్చింది కోర్టు.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో 2008లో పలు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో 80 మంది మృతి చెందారు. మరో 170 మంది గాయపడ్డారు.
undefined
also read:బీహార్‌లో దారుణం: దళిత బాలికపై గ్యాంగ్‌రేప్‌కు యత్నం, కాల్పులు
మరో ముగ్గురు నిందితులు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఈ బాంబు పేలుళ్ల వెనుక టెర్రర్ గ్రూప్ ఇండియన్ ముజాహీద్దీన్ కో పౌండర్ యాసిన్ భత్కల్ ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులుగా కూడ ఉన్నాయని ఆ సమయంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
రాజస్థాన్ కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు కూడ దోషులకు బాంబులను సరఫరా చేశారని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన టెర్రరిస్ట్ వ్యతిరేక పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు కూడ 2008లో బాట్లా హౌజ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు.