కుళ్లిపోయిన మృతదేహాల మధ్య సజీవంగా 4 రోజుల చిన్నారి.. మూడు రోజులుగా అక్కడే...!

Published : Jun 16, 2023, 08:03 AM IST
కుళ్లిపోయిన మృతదేహాల మధ్య సజీవంగా 4 రోజుల చిన్నారి.. మూడు రోజులుగా అక్కడే...!

సారాంశం

ఉత్తరాఖండ్‌లో ఓ విషాద ఘటనలో ఒక జంట చనిపోగా, వారి మృతదేహాల మధ్య వారి నాలుగు రోజుల నవజాత శిశువు సజీవంగా దొరికింది. 

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. మూడు రోజులు గడిచిన తరువాత ఈ విషయం వెలుగు చూసింది. అయితే.. వారి 4 రోజుల నవజాత శిశువు వారి కుళ్లిన మృతదేహాల మధ్యే సజీవంగా ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెడితే.. దాదాపు మూడు రోజులుగా మృతదేహాలు ఆచూకీ బైటికి తెలియకుండా పడి ఉన్నాయి.

మృతులు ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల కాషిఫ్, అతని భార్య అనమ్ (22) గా గుర్తించారు. ఈ జంటకు ఏడాది క్రితం వివాహమైంది. కాషిఫ్‌ రెండో పెళ్లి చేసుకున్నాడని, మొదటి పెళ్లిలో ఒక బిడ్డ కూడా ఉన్నాడని సమాచారం.

భార్యను కౌగిలించుకుని.. నాటు తుపాకీతో కాల్పులు.. అతడినీ బలి తీసుకున్న తూటా...

ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం వెలుగులోకి రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.సమాచారం అందుకున్న పోలీసు అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపించారు. మరణానికి గల కారణాన్ని గుర్తించి, తక్షణమే చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

భర్త అప్పులు చేయడం.. ఆ ఆర్థిక భారంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు ప్రాథమిక విచారణలో తేలింది. మృతుడి మొదటి భార్య నుస్రత్ అందించిన అదనపు సమాచారం ప్రకారం, గత రెండు మూడు రోజులుగా విడిపోయిన భర్తను సంప్రదించడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అయితే, అతని ఫోన్ కలవలేదు.

జూన్ 10వ తేదీ రాత్రి 11 గంటలకు చివరిసారిగా అతనితో మాట్లాడినట్లు నుస్రత్ పోలీసులకు తెలిపారు. అతను ఒకరి వద్ద తీసుకున్న రూ. 5 లక్షల అప్పు గురించి కాషిఫ్ తనతో చెప్పాడని నుస్రత్ చెప్పారు.

కాషిఫ్ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతని ఇంటికి వెళ్లానని, అయితే ఇంటికి తాళం వేసి ఉందని నుస్రత్ తెలిపారు. వెంటనే పరిస్థితిని మామ, బావమరిదికి తెలియజేసింది. కేసుకు సంబంధించి తదుపరి విచారణలు జరిగాయి.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?