ట్యుటుకొరిన్‌లో తండ్రీకొడుకుల కస్టోడియల్ డెత్: నలుగురు పోలీసుల అరెస్ట్

Published : Jul 02, 2020, 11:16 AM ISTUpdated : Jul 02, 2020, 11:22 AM IST
ట్యుటుకొరిన్‌లో తండ్రీకొడుకుల కస్టోడియల్ డెత్: నలుగురు పోలీసుల అరెస్ట్

సారాంశం

: ట్యుటుకొరిన్ లో ఇద్దరు వ్యాపారస్తుల కస్టోడియల్ మృతికి సంబంధించిన కేసులో నలుగురు తమిళనాడు పోలీసులు అరెస్టయ్యారు.

చెన్నై: ట్యుటుకొరిన్ లో ఇద్దరు వ్యాపారస్తుల కస్టోడియల్ మృతికి సంబంధించిన కేసులో నలుగురు తమిళనాడు పోలీసులు అరెస్టయ్యారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో నిర్ణీత సమయం కంటే 15 నిమిషాల పాటు దుకాణం తెరిచినందుకు గాను తమిళనాడు పోలీసులు తండ్రీ కొడుకులైన వ్యాపారస్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు చిత్రహింసలు భరించలేక తండ్రి కొడుకుమరణించినట్టుగా కుటుంబసభ్యులు, వ్యాపారస్తులు ఆరోపించారు. ఈ మేరకు ఆందోళనలు కూడ నిర్వహించారు. 

ఈ తరుణంలో ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది ప్రభుత్వం.  ఈ ఘటనలో సీఐ శ్రీధర్, ఎస్ఐ రఘు గణేష్, బాలకృష్ణన్, కానిస్టేబుల్ మురుగన్ తమిళనాడు సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

సీబీసీఐడీ ఆధ్వర్యంలో 12 స్పెషల్ పోలీస్ బృందాలు ఈ కేసు విచారణను ప్రారంభించాయి. సీబీ సీఐడీ రెండు ఎఫ్ఐఆర్ లను మోడీఫై చేశాయి.

తండ్రి జయరాజ్, కొడుకు బెంకీస్ ఎప్ఐఆర్ లను మోడీఫై చేశారు. ఇద్దరు ఎస్ఐలపై మర్డర్ చార్జీస్ దాఖలు చేశారు. వీరితో పాటుఇద్దరు కానిస్టేబుళ్లపై కూడ ఇదే రకమైన కేసులు నమోదు చేశారు.

తొలుత ఈ కేసునను అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎప్ఐఆర్ లో మార్పులు చేర్పులు చేశారు.

ఈ ఘటనను మద్రాస్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.  సీబీఐ విచారణకు ఆదేశించింది.పోస్టుమార్టం నివేదక ఆధారంగా ముగ్గురు పోలీసులు తండ్రీ కొడుకుల మరణానికి కారణమయ్యారని హైకోర్టు అభిప్రాయపడింది.

 


 

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu