నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత

Published : Aug 01, 2022, 05:27 PM IST
నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత

సారాంశం

కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేశారు. సస్పెన్షన్ ఎత్తివేయడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. 


న్యూఢిల్లీ: congress పార్టీకి చెందిన నలుగురు ఎంపీల సస్పెన్షన్ ను సోమవారం నాదు ఎత్తివేశారు. సోమవారం నాడు లోక్ సభ ప్రారంభమైన తర్వాత విపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలతో  సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండు సార్లు Loksabha వాయిదా పడింది.  Parliament ఉభయ సభల్లోనూ ఇదే రకమైన వాతావరణం కన్పించింది. లోక్ సభ, Rajyasabhaలు ప్రారంభమైన తర్వాత విపక్ష పార్టీల ఎంపీ ఆందోళనతో  ఉభయ సభలు వాయిదా పడ్డాయి.లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, జోతిమణి , రమ్య హరిదాస్, టీఎస్ ప్రతాపన్ ల సస్పెన్షన్ పై విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. 

భూ కుంభకోణం కేసులో  శివసేన ఎంపీ  సంజయ్ రౌత్ ను Enforcement Directorate అధికారులు అరెస్ట్ చేశారు. సంజయ్ రౌత్ అరెస్ట్ చు నిరసిస్తూ Shiv sena  ఎంపీలు ఆందోళన చేయడంతో రాజ్యసభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. రాజకీయ ఎజెండాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపించారు.  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిర్లక్ష్యం  చేయడంపై లెఫ్ట్ పార్టీ సభ్యులు పార్లమెంట్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు వేతాలను పెంచాలని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.

బెంగాల్  రాష్ట్రంలో చోటు చేసుకున్న టీచర్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో అవకతవకలపై  బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ  బీజేపీ  ఎంపీలు గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు.

ఈ రకమైన నిరసనలు సభ గౌరవాన్ని దిగజారుస్తున్నాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. సభా కార్యక్రమాలు జరగకపోవడం బాధ కల్గిస్తోందని స్పీకర్ ఓంబిర్లా చెప్పారు. సభ సంప్రదాయాలను కాపాడుకోవడం సమిష్టి బాధ్యత అని ఆయన అన్నారు.  సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని కూడా స్పీకర్ ఓం బిర్లా సూచించారు. 
ఈ విషయమై ఎంపీలతో స్పీకర్ ఓంబిర్లా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత లోక్ సభ తిరిగి ప్రారంభమైంది. ఎంపీలతో సమావేశంలో ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ నెలకొంది. ఈ విషయాన్ని మరోసారి సభ ముందుకు తెచ్చారు. ఈ విషయమై లోక్ సభలో ఎంపీలపై  సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ తీర్మానం ఆమోదించడంతో నలుగురు కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలోకి వచ్చారు.

లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ  అన్ని పార్టీలు సభలో తమ సమస్యలను అనుమతించేందుకు అనుమతించాలని స్పీకర్ ఓంబిర్లా కోరారు.  ధరల పెరుగుదలపై  ఇవాళ లోక్ సభలో రేపు రాజ్యసభలో చర్చకు సిద్దంగా ఉందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?