బర్త్‌డే వేడుకల్లో విషాదం: సముద్రంలో స్నానాలు.. నలుగురిని మింగిన రాకాసి అల

Siva Kodati |  
Published : Sep 09, 2019, 09:13 AM IST
బర్త్‌డే వేడుకల్లో విషాదం: సముద్రంలో స్నానాలు.. నలుగురిని మింగిన రాకాసి అల

సారాంశం

పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుని.. నాలుగు కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది. కేట్ కటింగ్ అనంతరం మధ్యాహ్నం ఎన్నూరు సముద్ర తీరంలోని కేవీకుప్పం వద్దకు  ఎనిమిది మంది వెళ్లారు. ఐదుగురు మిత్రులు ఒడ్డునే ఉండిపోగా.. మిగిలిన నలుగురు మాత్రం సముద్రంలోకి వెళ్లి స్నానాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ రాకాసి అల వీరిని లాగేసింది. 

పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుని.. నాలుగు కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం తిరువొత్తియూరు సమీపంలోని మనలి బల్జిపాళయంకు చెందిన రాకేశ్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఇంట్లో వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకలో పాల్గొనేందుకు రాకేశ్ స్నేహితులు 8 మంది అతని ఇంటికి వచ్చారు. కేట్ కటింగ్ అనంతరం మధ్యాహ్నం ఎన్నూరు సముద్ర తీరంలోని కేవీకుప్పం వద్దకు వెళ్లారు. ఐదుగురు మిత్రులు ఒడ్డునే ఉండిపోగా.. మిగిలిన నలుగురు మాత్రం సముద్రంలోకి వెళ్లి స్నానాలు చేస్తున్నారు.

ఈ సమయంలో ఓ రాకాసి అల వీరిని లాగేసింది. స్నానం చేస్తున్న మిత్రులు కనిపించకపోవడంతో ఒడ్డున ఉన్న మిత్రులు భయంతో కేకలు పెట్టగా.. సమీపంలో ఉన్న జాలర్లు వచ్చి నలుగురి కోసం గాలించి ధనుష్ మృతదేహాన్ని బయటకు తీశారు.

ఆదివారం చేపలవేటకు వెళ్లిన మత్య్సకారుల వలలో ఓ మృతదేహం పడగా.. మరో మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. వీరిని జయభారతి, సునీల్ కుమార్‌గా గుర్తించారు. గోకుల్‌నాథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word