బరి తెగించిన పాక్, కాల్పుల విరమణ ఉల్లంఘన: 4గురు జవాన్ల మృతి

First Published Jun 13, 2018, 7:00 AM IST
Highlights

కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడి పాకిస్తాన్ రేంజర్స్ జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లా చాంబ్లియాల్ సెక్టార్ లో కాల్పులు జరిపారు. 

శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది. కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడి పాకిస్తాన్ రేంజర్స్ జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లా చాంబ్లియాల్ సెక్టార్ లో కాల్పులు జరిపారు. 

జమ్మూ కాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దులో వారు ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆ కాల్పుల్లో నలుగురు బిఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.

2003లో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని గత నెలలోనే పాకిస్తాన్, భారత్ పరస్పరం ఓ అంగీకారానికి వచ్చాయి. శాంతి స్థాపనకు ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచాలని, సరిహద్దు వెంబడి పౌరులకు ఇబ్బందులు కలిగించవద్దని కూడా అనుకున్నాయి. 

కానీ ఇంతలోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.

click me!