Earthquake: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం.. 4.1 తీవ్రత.. భ‌యంతో జ‌నం ప‌రుగులు

Published : May 01, 2022, 06:24 AM ISTUpdated : May 01, 2022, 06:45 AM IST
 Earthquake: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం.. 4.1 తీవ్రత.. భ‌యంతో జ‌నం ప‌రుగులు

సారాంశం

Earthquake: అండమాన్  నికోబార్ దీవుల్లోని డిగ్లిపూర్ లో శనివారం అర్థ‌రాత్రి భూకంపం సంబంధించింది. రిక్ట‌ర్ స్కేల్ పై దీని తీవ్ర‌త  4.1 గా న‌మోదు అయ్యింది. డిగ్లీపూర్‌కు 3 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిన‌ట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.   

Earthquake: అండమాన్  నికోబార్ దీవుల్లోని డిగ్లిపూర్ లో శనివారం అర్థ‌రాత్రి  భూకంపం సంభవించింది. భూమి కంపించ‌డంతో ప్ర‌జలు భ‌యంతో రోడ్డు మీద‌కు ప‌రుగులు తీశారు. అధికారుల కథనం ప్రకారం.. డిగ్లిపూర్ కు 3 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.శనివారం రాత్రి 11:04 గంటలకు భూకంపం సంభవించిన‌ట్టు అధికారులు తెలిపారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్విట్ ద్వారా తెలిపింది. "భూకంపం తీవ్రత:4.1, 30-04-2022న 23:04 ( భార‌త కాల‌మాన ప్ర‌కారం) నిమిషాల‌కు అక్షాంశం: 13.25,  రేఖాంశం: 92.96, లోతు: 5 కి.మీ., స్థానం: డిగ్లిపూర్, అండమాన్ మరియు నికోబార్ నేషనల్ సెంటర్‌లో 3 కి.మీ. SW" భూకంపశాస్త్రం కోసం ట్వీట్ చేసింది. అయితే కొన్ని చోట్ల ఇల్లు కంపించడంతో జనం బయటకు పరుగులు తీశారు.  ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

 గ‌త నెల‌లో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ప‌లుమార్లు భూమి కంపించింది. గ‌త నెల 10 న  ఈ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.9గా నమోదయింది నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఈ  భూపంకం వల్ల  భారీగానే నష్టం సంబంధించినట్టు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. గ‌త నెల‌లో ఉత్త‌ర‌ఖండ్ లో ప‌లుమార్లు భూమి కంపించింది. ఉత్త‌ర కాశీలో భూకంపం సంబంధించింది. దీని తీవ్రత 4.1 గా న‌మోద‌న‌ట్టు అధికారులు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో ఉత్తరకాశీలో మూడు సార్లు భూకంపించ‌డం గ‌మ‌నార్హం. అంతకుముందు  ఫిబ్రవరి 5న  కూడా 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈనెల 10న జమ్ముకశ్మీర్‌ సహా ఢిల్లీ ఎన్సీఆర్‌, ఉత్తరాఖండ్‌లో 5.7 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.

ఇదిలావుంటే, రిక్టర్ స్కేలుపై 7.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపం సాధారణం కంటే ప్రమాదకరమైనదిగా పరిగణించడం జరుగుతుంది. ఈ స్థాయిలో 2.0 లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాన్ని మైక్రో భూకంపం అంటారు. ఇవీ సర్వ సాధారణంగా జరుగుతుంటాయి.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu