
Chhattisgarh: రోజురోజుకు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. నానాటికీ ఘోరాలు పెరుగుతున్నాయి. మనుషుల్లో జాలి, దయ లాంటివి కనుమరుగైపోతున్నాయి. ఆటవిక జంతువుల్లా అత్యంత దారుణంగా ప్రవర్తిస్తోన్నారు. తాజాగా దొంగతనానికి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ వ్యక్తిని తలకిందులుగా కట్టేసి..చెట్టుకు వేలాడదీసి కొందరు విచక్షణ రహితంగా కొట్టారు. విడిచిపెట్టమని ఎంత బతిమిలాడిన.. కనీసం సాటి మనిషి అనే కనికరంగ లేకుండా.. గొడ్డును బాదినట్టు బాదారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకెళ్తే.. సిపట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్న మహావీర్ అనే వ్యక్తి ఇటీవల తన ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించినట్లు మనీష్ అనే వ్యక్తి ఆరోపించాడు.
అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అతడు చెప్పాడు. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా ఈ వ్యవహారాన్ని తాము సెటిల్ చేసుకుంటామని చెప్పడంతో మహావీర్‌ను పోలీసులు వదిలేశారు. కాగా, అతడు మరోసారి చోరీకి ప్రయత్నించడాని మనీష్‌తోపాటు మరికొందరు గ్రామస్థులు మహావీర్ ను
పట్టుకుని దారుణంగా కొట్టారు.
ఈ క్రమంలో మహావీర్ ను రెండు కాళ్లు తాడుతో కట్టివేసి.. ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి మరీ చితకబాదారు. అతడు విడిచిపెట్టమని, ఎంత బతిమిలాడిన.. వారు అతనిపై కనికరం చూపలేదు. మృగాళ్ల దారుణంగా ప్రవర్తించారు. అత్యంత దారుణంగా.. పాశవికంగా కొట్టారు. ఈ దారుణాన్ని కొందరు తమ మొబైల్‌లో రికార్డు చేశారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ మహిళ ఈ దారుణాన్ని గమనించి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దీని గురించి చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లారు. చెట్టుకు వేలాడదీసి కొడుతున్న మహావీర్‌ను రక్షించారు.
మనీష్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరి కొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిందితుడు మహావీర్ పై దుర్భాషలాడడం, కర్రలతో కొట్టడం, అతను ఏడుస్తూ.. విడిచి పెట్టమని వేడుకోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. మరో వీడియో ఫుటేజీలో మహావీర్ చెట్టుకు వేలాడదీయడం. అతను అరుస్తూ సహాయం కోసం పిలవడం, కానీ, నిందితులు అతనిపై కాస్త జాలి, కనికరం చూపించకుండా కొట్టడం కనిపిస్తోంది.
ఈ దారుణంపై వికాస్ కుమార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO), సిపత్ మాట్లాడుతూ.. నిందితులలో ఒకరైన మనీష్, మహావీర్ ఈ వారం ప్రారంభంలో దొంగతనం చేయడానికి తన ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే అతని కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని పోలీసులకు చెప్పారు. అయితే.. ఈ విషయాన్ని పరిష్కరించాలనుకుంటున్నట్లు చెప్పడంతో మహావీర్ హెచ్చరికతో విడిచిపెట్టబడ్డామని కుమార్ చెప్పారు.