కేంద్రమంత్రిపై రెండు రోజుల్లో 39 ఎఫ్ఐఆర్‌లు.. అన్ని మహారాష్ట్రలోనే

By telugu teamFirst Published Aug 21, 2021, 2:52 PM IST
Highlights


జన ఆశీర్వాద్ యాత్ర క్యాంపెయిన్‌లో భాగంగా కేంద్ర పథకాలు, నిర్ణయాలను ప్రచారం చేస్తున్న కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై మహారాష్ట్రలో రెండు రోజుల గడువులోనే 39 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యి. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలే ప్రధానంగా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్ అయ్యాయి.

ముంబయి: కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై మహారాష్ట్రంలో 39 ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్ అయ్యాయి. గురు, శుక్రవారాల్లోనే ఈ కేసులు నమోదవడం గమనార్హం. అవి కూడా కేవలం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ  ప్రక్షాళనగావించిన తర్వాత మహారాష్ట్ర నుంచి నారాయణ్ రాణే క్యాబినెట్‌లో చోటుదక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యత తరహా పరిశ్రమల పోర్ట్‌ఫోలియోను చూస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవలన్న లక్ష్యంతో బీజేపీ జన ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మహారాష్ట్రలో పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, ఆయన ఈ క్యాంపెయినింగ్ సమయంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై రాష్ట్రంలో 39 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. 

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ములుండ్, ఘాట్‌కోపర్‌లో రెండేసి ఎఫ్ఐఆర్‌లు, విక్రోలీ, బాండూపర్, పంత్‌నగర్, ఖార్‌లలో రెండు ఎఫ్ఐఆర్‌ల చొప్పున రిజిస్టర్ అయ్యారు. శాంటాక్రజ్, పొవాయ్, ఎంఐడీసీ, సాకినాక, మేఘవాడి, గోరేగావ్, చార్కోప్, బోరివలీ, ఎంహెచ్‌బీ కాలనీ, వనరాయ్, కురార్, దహిసార్, ఆజాద్ మైదాన్, గాందేవి, అగ్రిపదాలలో మూడేసి ఎఫ్ఐఆర్‌లు, సియాన్‌లో రెండు, కాలాచౌకీ, మాహిమ్‌లలో మూడేసి, శివాజీ పార్క్, దాదార్, చెంబూర్, గోవండీలలో రెండు చొప్పున ఎఫ్ఐఆర్‌లు కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై నమోదయ్యాయి. వీటితోపాటు వైల్ పార్లే, ఖేర్వాడీ, ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లలోనూ రిజిస్టర్ అయ్యాయి.

click me!