మహిళా సాధ్విని తుపాకీతో బెదిరించి.. అత్యాచారం!

By telugu news teamFirst Published Sep 10, 2020, 7:57 AM IST
Highlights

నలుగురు సాయుధ దుండగులు మహిళ సత్సంగ్ ఆశ్రమం ప్రహరీగోడ దూకి లోపలకు వచ్చి ఆశ్రమవాసులను వేర్వేరు గదుల్లో బందీలను చేశారు. కాగా.. ఈ మహిళా సాధ్విని మాత్రం బలవంతంగా గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

సాధారణ మానవ జీవితాన్ని వదిలేసి.. దేవుడికి సేవ చేసుకుంటూ.. జీవితం వెల్లదీస్తున్న ఓ మహిళా సాధ్విపై కామాంధుల కన్నుపడింది. దేవుడి ఆశ్రమంలో ఉంటున్న సాధ్వీని తుపాకీతో బెదిరించి మరీ కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జార్ఖండ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రం గొడ్డా జిల్లాలోని ఓ ఆశ్రమంలో ఓ మహిళా సాధ్వి నివసిస్తోంది. కాగా.. ఈ నెల 7వ తేదీన అర్థరాత్రి సమయంలో కొందరు దుండగులు ఆశ్రమంలోకి ప్రవేశించారు. అనంతరం సదరు సాధ్విని తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.

నలుగురు సాయుధ దుండగులు మహిళ సత్సంగ్ ఆశ్రమం ప్రహరీగోడ దూకి లోపలకు వచ్చి ఆశ్రమవాసులను వేర్వేరు గదుల్లో బందీలను చేశారు. కాగా.. ఈ మహిళా సాధ్విని మాత్రం బలవంతంగా గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా.. ఈ ఆశ్రమం మొత్తంలొ ఒకే ఒక్క పురుషుడు ఉన్నాడు. అతను వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కొట్టి ఓ గదిలో పడేశారు.

కాగా... బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

click me!