ఒడిశాలో దారుణం.. మహిళపై విచక్షణ రహితంగా దాడి.. 33 మంది అరెస్టు

By Rajesh KarampooriFirst Published Oct 28, 2022, 6:20 AM IST
Highlights

ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణం జరిగింది. 50 ఏళ్ల మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసి..హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు  ముప్పై మూడు మందిని  అరెస్టు చేశారు. కబీసూర్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురచువా గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణం జరిగింది. 50 ఏళ్ల మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసి..హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు  ముప్పై మూడు మందిని  అరెస్టు చేశారు. కబీసూర్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. కబీసూర్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుచువా గ్రామంలో నివసిస్తున్న యుధిష్ఠిర నాయక్  దంపతులు మంత్రాలు చేస్తూ.. గ్రామస్థులను భయాభంత్రులకు గురిస్తున్నారనే అనుమానంతో  వారిపై స్థానికులు దుర్భాషలాడుతూ..దౌర్జన్యం చేసి దాడి చేశారు.

దీంతో యుధిష్ఠిర నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు బుధవారం రాత్రి ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో యుధిష్ఠిరుడు,అతని కుమారుడు ఇంటి నుండి తప్పించుకోగలిగారు. కానీ..అతని భార్య జును తపించుకోలేకపోయింది. యుధిష్ఠిరుడు పోలీసులతో ఇంటికి తిరిగి వచ్చే సరికి తన భార్య రక్తం మడుగులో పడి.. ప్రాణాలు కోల్పోయింది. వాటి వంటి నిండా గాయాలు ఉన్నాయి. తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నారని యుధిష్ఠిర నాయక్  ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గ్రామస్థుల దాడిలో గాయపడిన యుధిష్ఠిరుడు, అతని కొడుకు ను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.గ్రామంలో సాయుధ బలగాలను మోహరించినట్లు, పరిస్థితి అదుపులో ఉందని పురుషోత్తంపూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి రజనీకాంత్ సమాల్ తెలిపారు. మహిళ హత్య కేసులో 20 మంది మహిళలతో సహా 33 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

యుధిష్ఠిర కుటుంబం చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్థులు నెల రోజుల క్రితం వారిని టార్గెట్ చేశారని పోలీసులు తెలిపారు. తక్కువ సమయంలో ముగ్గురి మరణానికి యుధిష్ఠిరుని కుటుంబాన్ని బాధ్యులను చేశారు. సకాలంలో జోక్యం చేసుకోవడంతో సమస్య పరిష్కారమైందని కబీసూర్యనగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రభాత్ సాహు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన దాడికి, మంత్రగాళ్ల ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు.

click me!