జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

By telugu news teamFirst Published Aug 29, 2020, 8:52 AM IST
Highlights

 ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా.. వారి వద్ద నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఎన్ కౌంటర్ కలకలం రేగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఎన్ కౌంటర్ నిర్వహించారు. కాగా.. ఈ ఎన్ కౌంటర్ లో ఓ సైనికుడు కూడా గాయపడ్డాడని.. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఉగ్రవాదులు ఉన్నట్టుగా సమాచారం అందడంతో పోలీసులు, ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.  అయితే, బలగాలు చుట్టుముట్టాయని తెలుసుకున్న ముష్కరులు కాల్పులు జరిపారు.  దీంతో భద్రబలగాలు కూడా కాల్పులు జరిపాయి.  ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా.. వారి వద్ద నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

కాగా.. ఆ ఉగ్రవాదులు ఎవరూ అనేది ఇంకా తేలలేదు. కాగా.. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. వీరితో కలిసి గత 24గంటల్లో ఏడుగుగురు ఉగ్రవాదాలను హతమార్చినట్లు అధికారులు చెప్పారు.  ఈ ఏడాది జమ్మూకశ్మీర్ లో ఇప్పటి వరకు 153మంది ఉగ్రవాదులను హతమార్చారు.

ఇదిలా ఉండగా.. శుక్రవారం సాయంత్రం కూడా జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ కలకలం రేగింది.  ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు.  ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో షాకూర్ అహ్మద్ పర్రె అనే ఓ ఉగ్రవాది కూడా హతం అయినట్టు పోలీసులు చెప్తున్నారు.  అహ్మద్ నాలుగేళ్లక్రితం పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశాడు.  అనంతనాగ్ జిల్లాలోని బిజ్జెహార పోలీస్ స్టేషన్ లో నాలుగు ఏకె 47 తుపాకులను అపహరించుకుపోయారు.  సొంతంగా ఆల్ బదర్ అనే ఉగ్రవాద గ్రూపును ఏర్పాటు చేసి పదిమంది యువకులను ఉగ్రవాదులుగా  మార్చాడు.  అయితే, వీరిలో ఐదుగురు కీలూరా ప్రాంతంలోని అడవిలో ఉన్నట్టుగా సమాచారం అందడంతో పోలీసులు, ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.  అయితే, బలగాలు చుట్టుముట్టాయని తెలుసుకున్న ముష్కరులు కాల్పులు జరిపారు.  దీంతో భద్రబలగాలు కూడా కాల్పులు జరిపాయి.  ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.  వీరిలో షాకూర్ అహ్మద్ కూడా ఉన్నట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి


 

click me!